KanguvaTrailer: కంగువా స్పెషల్ అప్డేట్..సూర్య విశ్వరూపం చూసేది అప్పుడే

KanguvaTrailer: కంగువా స్పెషల్ అప్డేట్..సూర్య విశ్వరూపం చూసేది అప్పుడే

డిఫరెంట్ కాన్సెప్ట్‌‌‌‌‌‌‌‌ సినిమాలతో ఆకట్టుకునే సూర్య (Suriya)..ప్రస్తుతం కంగువ (Kanguva) అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. శివ(Shiva) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియాడికల్ యాక్షన్‌‌‌‌‌‌‌‌ డ్రామాను స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్, వీడియో గ్లింప్స్‌‌‌‌‌‌‌‌ సినిమాపై అంచనాలు పెంచాయి.

తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ప్రేక్షకుల ఎదురుచూపులు ఇప్పుడు ముగిశాయి! కీర్తికి సమయం ఆసన్నమైంది..మరెక్కడా లేని విధంగా వేడుక కోసం సిద్ధంగా ఉండండి " గ్రాండ్ గా కంగువ ట్రైలర్ ఆగస్ట్ 12 నుండి మీ కోసం సిద్ధంగా ఉంది" అంటూ మేకర్స్ స్పెషల్ అప్డేట్ ఇచ్చారు.ఇక ఈ మూవీ అక్టోబర్ 10న థియేటర్స్ లోకి రానుండగా దీనికి రెండు నెలల ముందే ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్టుగా సూర్యపై ఒక పవర్ఫుల్ పోస్టర్ తో మేకర్స్ అనౌన్స్ చేశారు. 

కంగువ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దిషా పఠాని హీరోయిన్గా నటిస్తోంది. 3Dలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు..రాక్స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) సంగీతం అందిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పది భాషల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేయనుందో చూడాలి.