మాస్‌‌ మెచ్చేలా సూర్య వీరభద్రుడు

మాస్‌‌ మెచ్చేలా సూర్య వీరభద్రుడు

సూర్య హీరోగా నటించిన తమిళ చిత్రం ‘కరుప్పు’. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ నిర్మించింది. తెలుగులో ‘వీరభద్రుడు’ టైటిల్‌‌‌‌తో అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా ఈనెల 14న రిలీజ్‌‌కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌ను నిర్వహించారు. అతిథిగా హాజరైన  కార్తి మాట్లాడుతూ ‘ఇలాంటి క్యారెక్టర్‌‌ను అన్నయ్య మాత్రమే చేయగలరు. ఆ మాస్ ఆయనకే సాధ్యపడుతుంది.

సినిమాను సెలబ్రేట్ చేసుకునే ప్రేక్షకుల కోసం తీసిన చిత్రమిది’ అని అన్నాడు. ఈవెంట్‌‌లో పాల్గొన్న  డైరెక్టర్ వెంకీ అట్లూరి మాట్లాడుతూ ‘డివైన్ ఎలిమెంట్‌‌తో పాటు సోషల్ యాంగిల్‌‌ను మిక్స్ చేసి ఆర్.జే. బాలాజీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సూర్య గారితో ప్రస్తుతం ‘విశ్వనాథ్​ అండ్ సన్స్’ చిత్రాన్ని రూపొందిస్తున్నా. ఆయనతో వర్క్ చేయడం చాలా హ్యాపీ. ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని  కోరుకుంటున్నా’ అని అన్నాడు.

సూర్య మాట్లాడుతూ  ‘ఆర్.జే. బాలాజీ ఈ కథను చాలా సిన్సియర్‌‌గా రాశారు.  ఫస్ట్ హాఫ్  మంచి ఎమోషనల్ కోర్ట్‌‌రూమ్ డ్రామాగా సాగుతుంది. సెకండ్ హాఫ్ మాత్రం పూర్తి స్థాయి మాస్ మసాలా మూమెంట్స్‌‌తో ఉంటుంది. అలాగే హ్యూమర్ కూడా ఉంటుంది. ఈ సినిమాతో ప్రేక్షకులు కచ్చితంగా  సంతృప్తి పొందుతారు.  అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమాను రిలీజ్ చేయడం  గౌరవంగా భావిస్తున్నాం’ అని చెప్పారు. డైరెక్టర్ ఆర్‌‌‌‌జే బాలాజీ మాట్లాడుతూ ‘ఇదొక  ఇంటెలిజెంట్ కమర్షియల్ ఫిల్మ్.  అభిమానులు చూడాలనుకునే సూర్య సార్‌‌ను ఈ సినిమాలో చూపించాం’ అని చెప్పాడు. నిర్మాత సుప్రియ యార్లగడ్డ, లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి, రైటర్ రాకేందు మౌళి పాల్గొన్నారు.