ఇండియా, పాక్‌‌ జట్ల మధ్య మరో వివాదం.. పాక్‌‌ కెప్టెన్‌‌తో ఫొటోషూట్‌‌కు నో చెప్పిన సూర్య

ఇండియా, పాక్‌‌ జట్ల మధ్య మరో వివాదం.. పాక్‌‌ కెప్టెన్‌‌తో ఫొటోషూట్‌‌కు నో చెప్పిన సూర్య

దుబాయ్‌‌: ఆసియా కప్‌‌ ఫైనల్‌కు కొన్ని గంటల ముందు ఇండియా, పాక్‌‌ జట్ల మధ్య మరో వివాదం రేగింది. టైటిల్ ఫైట్ ముంగిట ఇరు జట్ల కెప్టెన్లు ట్రోఫీ ఫొటో దిగడం ఆనవాయితీ. కానీ, పాక్‌‌ లీడర్‌‌‌‌సల్మాన్‌‌ ఆగాతో కలిసి ఫొటో షూట్‌‌లో పాల్గొనేందుకు ఇండియా కెప్టెన్‌‌ సూర్యకుమార్‌‌‌‌ నో చెప్పాడు. దీనిపై స్పందించిన సల్మాన్‌‌ అది టీమిండియా ఇష్టమని పేర్కొన్నాడు. మరోవైపు ఆదివారం జరిగే ఫైనల్‌‌కు పాక్‌‌ మంత్రి, పీసీబీ చైర్మన్ అయిన మోహ్‌‌సిన్ నఖ్వీ ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్‌‌ హోదాలో విన్నర్‌‌‌‌కు ట్రోఫీని అందజేయాల్సి ఉంది.

నిబంధనల ప్రకారం ఏసీసీ చీఫ్‌గా నఖ్వీ ఆటగాళ్లతో కరచాలనం చేయాలి. కానీ, ఇండియా పాక్‌‌తో నో షేక్‌‌హ్యాండ్ పాలసీ అమలు చేస్తోంది. ఒకవేళ ఇండియా విన్నర్‌‎గా నిలిస్తే పాక్ మంత్రి అయిన నఖ్వీ నుంచి ట్రోఫీ అందుకుంటుందా..? నిరాకరిస్తే ఏం జరుగుతుంది..? అనేది ఉత్కంఠగా మారింది. తమకు వ్యతిరేకంగా బహిరంగ ప్రకటనలు చేసిన నఖ్వీతో మాట్లాడేందుకు సైతం ప్లేయర్లను బీసీసీఐ అనుమతించే అవకాశం కనిపించడం లేదు.

==================================================