
సూర్య నటించిన ‘రెట్రో’ (Retro) మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. మే1న థియేటర్లలో విడుదలైన రెట్రో మూవీ మే31న నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్కు రానుంది. తమిళం, తెలుగు, మలయాళం & కన్నడ, హిందీ భాషలలో అందుబాటులో ఉండనుంది. ఈ విషయాన్నీ అధికారికంగా ప్రకటించారు. థియేటర్స్లో రిలీజైన నెల రోజుల లోపే ఓటీటీలోకి వస్తుండటంతో డిజిటల్ ఆడియన్స్ ఖుషి అవుతున్నారు.
Finally🍿🔥#Retro (Tamil) , streaming from May 31st on Netflix in Tamil, Telugu, Malayalam & Kannada !!@Suriya_offl @hegdepooja@karthiksubbaraj @Music_Santhosh#OTT_Trackers pic.twitter.com/tG7MsDbolA
— OTT Trackers (@OTT_Trackers) May 26, 2025
రెట్రో మూవీని సూర్య, జ్యోతిక హోమ్ బ్యానర్ 2డీ ఎంటర్టైన్మెంట్ మరియు స్టోన్ బెంచ్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ మూవీకి ప్రమోషన్స్, రెమ్యునరేషన్స్తో కలిపి సుమారుగా రూ.70 కోట్లు ఖర్చు పెట్టారు. అంచనాలకు తగ్గట్టుగానే ఈ మూవీ రూ.235 కోట్ల కలెక్షన్లు వసూళ్లు చేసి సూర్యకు సక్సెస్ అందించింది.
అయితే, ముందుగా ఈ సినిమాకు మిక్సెడ్ టాక్ వచ్చింది. కానీ, క్రమ క్రమంగా సూర్య హైవోల్టేజ్ యాక్షన్, లవ్ స్టోరీకి ఫిదా అవుతూ ఈ మేరకైనా వసూళ్లు వచ్చేలా చేశారు ఆడియన్స్. పేట, మహాన్, జిగర్తాండ, జిగర్తాండ డబుల్ ఎక్స్ వంటి చిత్రాలన్నీ తెరకెక్కించిన కార్తీక్ సుబ్బరాజ్ ఈ సినిమాని కూడా అదే ఫార్మాట్ లో తెరకెక్కించాడు. అయితే, ఈ మూవీలో యాక్షన్ కు మాత్రమే పెద్దపీట వేయకుండా లవ్‍స్టోరీకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు.
1980-90ల బ్యాక్‍డ్రాప్‍లో గ్యాంగ్‍స్టర్ యాక్షన్ డ్రామాగా స్టయిలిష్ గా రూపొందించాడు. ఇందులో సూర్య పవర్ఫుల్ గ్యాంగ్ స్టర్ పాత్రలో నటించి మెప్పించాడు. కార్తీక్ సుబ్బరాజ్ యాక్షన్ మార్క్, టేకింగ్, సంతోష్ నారాయణన్ బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి.