కంగువ.. సూర్య స్క్రీన్ ప్రెజెన్స్ అదుర్స్

కంగువ..  సూర్య స్క్రీన్ ప్రెజెన్స్ అదుర్స్

ప్రయోగాత్మక చిత్రాల్లో నటిస్తూ, తమిళంతో పాటు తెలుగులోనూ స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నాడు సూర్య. ఇప్పుడు ‘కంగువ’ అంటూ మరో డిఫరెంట్ కాన్సెప్ట్‌‌‌‌తో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు.   ‘శౌర్యం’ ఫేమ్ శివ డైరెక్ట్ చేస్తుండగా, స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఆదివారం సూర్య పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్‌‌‌‌ను రిలీజ్ చేశారు. రెండు నిమిషాల పాటు సాగిన  వీడియోలో  విజువల్ గ్రాండియర్, హై క్వాలిటీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ సూర్య స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకున్నాయి.

 దేవి శ్రీ ప్రసాద్ బ్యాక్‌‌‌‌గ్రౌండ్ స్కోర్ మరో స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది.  డిఫరెంట్ లుక్‌‌‌‌లో చేతిలో జంతువు పుర్రె ఆకారంలో ఉన్న మాస్క్ పట్టుకుని, విచిత్రమైన ఆహార్యంతో సూర్య కనిపించిన తీరు సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ‘వే వేళ్ల పులిగోళ్ల పదునే వీడు.. శతకోటి సర్పాల పొగరే వీడు.. చెలరేగు సంద్రాల ముఖమే వీడు.. ఒక్కడే ఒక్క వీరుడు రా.. యుద్ధమై ఉరుకు శూరుడు రా..’ అంటూ సూర్య క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌ను పరిచయం చేసిన విధానం ఆకట్టుకుంది.  

ప్రస్తుతం ఇంగ్లీష్, హిందీ, తమిళ,  తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో టీజర్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేయగా, త్వరలోనే  మరో నాలుగు భాషల్లో కూడా విడుదల చేస్తామన్నారు దర్శక నిర్మాతలు. సూర్య నటిస్తోన్న 42వ చిత్రమిది. దిశా పటాని హీరోయిన్. యోగిబాబు కీలక పాత్ర పోషిస్తున్నాడు. వచ్చే ఏడాది పది భాషల్లో త్రీడీలో రిలీజ్‌‌‌‌ కానుంది.