మలయాళ దర్శకుడితో సూర్య కొత్త సినిమా

మలయాళ దర్శకుడితో సూర్య కొత్త సినిమా

కోలీవుడ్ స్టార్ సూర్య ప్రస్తుతం మల్టీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. తాజాగా  తన 47వ చిత్రాన్ని ప్రారంభించాడు. ఈ సినిమాకు ‘ఆవేశం’  ఫేమ్ మలయాళ ఫిల్మ్ మేకర్ జీతు మాధవన్‌‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో నజ్రియా నజీమ్ హీరోయిన్‌‌గా నటిస్తుండగా, ‘ప్రేమలు’ ఫేమ్  నస్లెన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. 2డీ ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్స్ బ్యానర్‌‌‌‌పై సూర్య, జ్యోతిక ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  ఆదివారం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. 

ఈ వేడుకకు మూవీ టీమ్‌‌తో పాటు డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మాతలు ఎస్‌‌ఆర్ ప్రకాష్, ఎస్‌‌ఆర్ ప్రభు అతిథులుగా హాజరై టీమ్‌‌కు బెస్ట్ విషెస్ చెప్పారు.  పూజా కార్యక్రమం అనంతరం చిత్రీకరణను ప్రారంభించారు. అధికారికంగా మొదటి  షెడ్యూల్‌‌ షూటింగ్‌‌ను స్టార్ట్ చేశారు. ఈ చిత్రంలో  జాన్ విజయ్, ఆనందరాజ్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. వినీత్ ఉన్ని సినిమాటోగ్రాఫర్‌‌‌‌గా, అశ్విని కాలే ప్రొడక్షన్ డిజైనర్‌‌‌‌గా, అజ్మల్ సాబు ఎడిటర్‌‌‌‌గా, చేతన్ డి సౌజా స్టంట్ మాస్టర్‌‌‌‌గా వర్క్ చేస్తున్న ఈ సినిమాకు సుషిన్ శ్యామ్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే  మరిన్ని ఎక్సయిటింగ్ అప్‌‌డేట్లు అందిస్తామని మేకర్స్ చెప్పారు.