HBD Prabhas: ప్రభాస్ బర్త్ డే.. ఒకేరోజు ఇన్ని సర్ ప్రైజ్లా.. డార్లింగ్ ఫ్యాన్స్ పండగ చేస్కోండి !

HBD Prabhas: ప్రభాస్ బర్త్ డే.. ఒకేరోజు ఇన్ని సర్ ప్రైజ్లా.. డార్లింగ్ ఫ్యాన్స్ పండగ చేస్కోండి !

స్టార్ హీరోల ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తమ అభిమాన హీరో బర్త్ డేను మించిన సెలబ్రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డే మరొకటి ఉండదు. ప్రభాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లాంటి మాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇమేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉన్న పాన్ ఇండియా స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఇది ఇంకాస్త ఎక్కువ. ప్రభాస్‌ నేడు గురువారం (2025 అక్టోబర్ 23న) తన 46వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు నుంచి అభిమాన సంఘాల వరకు డార్లింగ్కు ప్రేమతో శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

అయితే, ఈసారి బర్త్​డేకు అందరిచూపు, ప్రభాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న పీరియాడిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సినిమాపై ఉంది. టీ సిరీస్ సమర్పణలో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.  బుధవారం (అక్టోబర్ 22) టైటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రీ లుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు. 

‘‘ఒంటరిగా పోరాడిన బెటాలియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. 1932 నుంచి ఇతడి కోసం అందరూ వెతుకుతున్నారు..” అనే ట్యాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సినిమాపై ఆసక్తిని రేపుతున్నాయి. లాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రభాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బ్రిటీష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జెండా, భగవద్గీత శ్లోకాలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ‘పాండవుల పక్షాన ఉన్న కర్ణుడు..’ అనే క్యాప్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మరింత ఆసక్తి రేపుతోంది.

‘కల్కి 2898 ఏడీ’ చిత్రంలో కూడా ప్రభాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కర్ణుడి పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రానికి ‘ఫౌజీ’ అనే టైటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రచారంలో ఉండగా,  గురువారం (అక్టోబర్ 23) అసలు టైటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రివీల్ చేయబోతున్నారు. 

ఇదిలా ఉంటే ప్రభాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలిచిన ‘బాహుబలి’ ఫ్రాంచైజీలోని రెండు చిత్రాలను ‘బాహుబలి ది ఎపిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ పేరుతో ఈనెల 31న విడుదల చేయబోతున్నారు.

అలాగే ప్రభాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మారుతి తెరకెక్కిస్తున్న ‘ది రాజా సాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ సంక్రాంతి సందర్భంగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకురానుంది.  మరోవైపు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కనున్న ‘స్పిరిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ త్వరలో సెట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్లబోతోంది. అలాగే సలార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2, కల్కి 2 అభిమానులను ఎగ్జైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్నాయి.