రిపోర్ట్: 2025 నాటికి దేశంలో నెట్​ యూజర్లు 90 కోట్లు

రిపోర్ట్: 2025 నాటికి దేశంలో నెట్​ యూజర్లు 90 కోట్లు

2020 నాటికి 62.2 కోట్ల యూజర్లు
నాలుగేళ్లలో 45 శాతం గ్రోత్​!

న్యూఢిల్లీ: మన దేశంలో ఇంటర్​నెట్​ యూజర్ల సంఖ్య 2025 నాటికి 90 కోట్లకు చేరుతుందని ఒక రిపోర్టు వెల్లడించింది.2020 నాటికి దేశంలో ఇంటర్​నెట్ యూజర్లు 62.2 కోట్లని ఐఏఎంఏఐ, కంటార్​ రీసెర్చ్​ రిపోర్టు తెలిపింది. అంటే నాలుగేళ్లలో 45 శాతం పెరుగుతుందని అంచనా వేస్తోంది. అర్బన్​ ఏరియాలలో ఇంటర్​నెట్​ రీచ్​ ఎక్కువగా ఉందని, రూరల్​ ఏరియాలతో పోలిస్తే ఇది రెండు రెట్లు కంటే ఎక్కువేనని పేర్కొంది. అర్బన్​ సెంటర్లలో ఇంటర్​నెట్​ యూజర్లు 32.3 కోట్లని, అర్బన్​ జనాభాలో ఇది 67 శాతానికి సమానమని వివరించింది. 2020 నాటికి రూరల్​ ఏరియాలలోని ఇంటర్​నెట్​ యూజర్లు  29.9 కోట్లు మాత్రమేనని, అంటే  మొత్తం రూరల్​ జనాభాలో 31 శాతం మందికి మాత్రమే నెట్​ యాక్సెస్​ ఉందని రిపోర్టు తెలిపింది.  రాబోయే ఏళ్లలో రూరల్​ ఏరియాలోని ఇంటర్​నెట్​ యూజర్ల సంఖ్య బాగా పెరుగుతుందని అంచనా వేస్తోంది. లోకల్​ లాంగ్వేజ్​, వాయిస్​, వీడియోలు, డిజిటల్​ ఎకో సిస్టమ్​లో ముఖ్యమైనవవుతాయని కంటార్​ రీసెర్చ్​ ఎగ్జిక్యూటివ్​ వైస్​ ప్రెసిడెంట్​ విశ్వప్రియ భట్టాచార్జీ చెప్పారు. ఇంటర్​నెట్​ వాడుతున్న ప్రతి పదిమందిలోనూ 9 మంది రోజూ  నెట్​ వాడుతున్నారని, ఏవరేజ్​గా 107 నిమిషాలు నెట్టింట్లోనే గడుపుతున్నారని రిపోర్టు వివరించింది. దేశంలో ఇంటర్​నెట్​ గ్రోత్​కు ప్రధాన కారణమం మొబైల్​ ఫోన్లేనని ఈ రిపోర్టు తేల్చింది.  వినోదం​, కమ్యూనికేషన్​, సోషల్​ మీడియా   కోసమే ఎక్కువగా ఇంటర్​నెట్​ను  వాడుతున్నారని తెలిపింది.