పొలం సర్వేకు 20 వేల లంచం.. ఏసీబీకి పట్టించిన రైతు

పొలం సర్వేకు 20 వేల లంచం.. ఏసీబీకి పట్టించిన రైతు

జోగులాంబ గద్వాల జిల్లా: ఓ రైతు దగ్గర రూ.20వేలు లంచం తీసుకుంటూ సర్వేయర్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుపడ్డాడు. జోగులాంబ గద్వాల జిల్లా  కాలూరు తిమ్మన దొడ్డి మండల రెవెన్యూ కార్యాలయంలో బుధవారం లంచం తీసుకుంటున్న సర్వేయర్ ను ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. సర్వేయర్ తిక్కన్న ఓ రైతుకు చెందిన పొలం సర్వే కోసం 20 వేల రూపాయల లంచం డిమాండ్ చేశాడు. ఏసీబీని ఆశ్రయించిన రైతు డబ్బు తీసుకొచ్చి సర్వేయర్ కు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కార్యాలయంలోని రికార్డులతోపాటు  అతని ఇంట్లో మరో బృందం ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 
 

Read More:

బైడెన్ పిలుపు.. ప్రధాని మోడీ అమెరికా ప్రయాణం

ఎగ్ దోశ కోసం డబ్బులివ్వలేదని.. అలిగి బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

సామాన్యులకు దహనం.. స్వామీజీలకు సమాధి: ఇలా ఎందుకంటే?