రెండో ర్యాంక్‌‌‌‌లో సూర్యకుమార్‌‌‌‌‌‌‌‌‌‌

రెండో ర్యాంక్‌‌‌‌లో  సూర్యకుమార్‌‌‌‌‌‌‌‌‌‌

దుబాయ్‌‌‌‌: వెస్టిండీస్‌‌‌‌తో సిరీస్‌‌‌‌లో విశేషంగా రాణిస్తున్న ఇండియా బ్యాటర్‌‌‌‌ సూర్యకుమార్‌‌‌‌ యాదవ్‌‌‌‌.. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌‌‌‌ను మెరుగుపర్చుకున్నాడు. బుధవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌‌‌‌లో మూడు స్థానాలు మెరుగుపడి రెండో ర్యాంక్‌‌‌‌లో నిలిచాడు. ప్రస్తుతం అతని ఖాతాలో 816 రేటింగ్‌‌‌‌ పాయింట్లు ఉన్నాయి. విండీస్‌‌‌‌తో మంగళవారం రాత్రి జరిగిన థర్డ్‌‌‌‌ టీ20లో 76 రన్స్‌‌‌‌ చేయడం సూర్య ర్యాంక్‌‌‌‌ మెరుగుపడటానికి దోహదం చేసింది. ఇషాన్‌‌‌‌ కిషన్‌‌‌‌ (626), రోహిత్‌‌‌‌ శర్మ (598), లోకేశ్‌‌‌‌ రాహుల్‌‌‌‌ (567) వరుసగా 14, 16, 20వ ర్యాంక్‌‌‌‌ల్లో కొనసాగుతున్నారు.  

మూడో టీ20 మనదే

మరోవైపు మంగళవారం అర్ధరాత్రి ముగిసిన మూడో టీ20లో ఇండియా 7 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌‌‌‌పై గెలిచింది. దీంతో మూడు మ్యాచ్‌‌‌‌ల సిరీస్‌‌‌‌లో 2–1 లీడ్‌‌‌‌లో నిలిచింది. ముందుగా విండీస్‌‌‌‌ 164/5 స్కోరు చేయగా, దాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇండియా 19 ఓవర్లలో 165/3 స్కోరు చేసి నెగ్గింది. సూర్యకుమార్‌‌‌‌ (76), పంత్‌‌‌‌ (33 నాటౌట్‌‌‌‌)రాణించారు.