సింగం 4కి రెడీ..

V6 Velugu Posted on May 25, 2021

‘క‌‌నిపించే మూడు సింహాలు చ‌‌ట్టానికి, న్యాయానికి, ధ‌‌ర్మానికి ప్ర‌‌తీక‌‌లైతే క‌‌నిపించ‌‌ని ఆ నాలుగో సింహామేరా పోలీస్’ అంటూ పోలీస్ ఇంపార్టెన్స్‌‌ని ఒక్క డైలాగ్‌‌లో చెప్పేశారు ఒక సినిమాలో. అలాంటి ప‌‌వర్‌‌‌‌ఫుల్‌‌ పోలీస్ సినిమాలు చాలానే వచ్చాయి. వాటిలో ‘సింగం’ సిరీస్‌‌కి ఓ ప్రత్యేక స్థానం ఉంది. సూర్య హీరోగా హ‌‌రి ద‌‌ర్శ‌‌క‌‌త్వంలో రూపొందిన ఈ ఫ్రాంచైజీలో ఇప్ప‌‌టికే మూడు సినిమాలొచ్చాయి. మొద‌‌టి సినిమా త‌‌మిళంతో పాటు తెలుగులోనూ బ్లాక్ బ‌‌స్ట‌‌ర్ హిట్ కొట్టింది. రెండోది ఆ స‌‌క్సెస్‌‌ని కంటిన్యూ చేసింది. హిందీలోనూ రీమేక్ అయ్యి మెప్పించింది. అయితే మూడో సినిమా మాత్రం అంచ‌‌నాల‌‌ను అందుకోలేక‌‌పోయింది. అయినప్ప‌‌టికీ ‘సింగం’ సిరీస్‌‌ పట్ల క్రేజ్ ఏమాత్రం త‌‌గ్గ‌‌లేదు. కొన్నాళ్లుగా నాలుగో సింగంని తీసుకు రావడానికి ద‌‌ర్శ‌‌కుడు హ‌‌రి ప్లాన్ చేస్తున్నాడని, స్క్రిప్ట్ వ‌‌ర్క్ జరుగుతోందని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడీ విష‌‌యంపై మ‌‌రింత క్లారిటీ వ‌‌చ్చింది. ఆగ‌‌స్టు నుండి ఈ మూవీ షూటింగ్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. మాస్ సినిమాల్లో త‌‌న‌‌దైన స్టైల్ ఆఫ్ మేకింగ్‌‌తో మెప్పించే హ‌‌రి, తన మూడు చిత్రాలకీ మించిన యాక్ష‌‌న్ ఎంట‌‌ర్‌‌‌‌టైనర్‌‌‌‌గా ఈ సినిమాని తెర‌‌కెక్కించ‌‌బోతున్నాడ‌‌ట‌‌. సూర్య సరసన హీరోయిన్ ఇంకా ఫైనలైజ్ కాలేదు కానీ ఓ స్టార్ హీరో గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వబోతున్నా డని మాత్రం తెలిసింది. తనెవరనేది చివరి వరకు సీక్రెట్‌‌గా ఉంచుతారట. ‘ఆకాశం నీ హ‌‌ద్దురా’తో తిరిగి స‌‌క్సెస్ ట్రాక్‌‌ పైకి వ‌‌చ్చిన సూర్య‌‌, ప్ర‌‌స్తుతం పాండిరాజ్ ద‌‌ర్శ‌‌క‌‌త్వంలో న‌‌టిస్తు న్నాడు. మ‌‌రికొన్ని చిత్రాలు క్యూలో ఉన్నాయి. ఇప్పుడు ‘సింగం 4’ ఆ లిస్టులో చేరింది.
 

Tagged surya, Singam 4, making a movie, director hari

Latest Videos

Subscribe Now

More News