Asia Cup 2025 Final: సూర్యకి సలాం కొట్టాల్సిందే: టోర్నీ మ్యాచ్ ఫీజ్ మొత్తాన్ని పెహల్గామ్ బాధితులకి ఇచ్చేసిన టీమిండియా కెప్టెన్

Asia Cup 2025 Final: సూర్యకి సలాం కొట్టాల్సిందే: టోర్నీ మ్యాచ్ ఫీజ్ మొత్తాన్ని పెహల్గామ్ బాధితులకి ఇచ్చేసిన టీమిండియా కెప్టెన్

ఆసియా కప్ 2025 టోర్నీలో పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లన్నీ వివాదాలు సృష్టించినవే. దాయాధి జట్ల మధ్య రెండు మ్యాచ్ లు జరిగితే రెండు మ్యాచ్ ల్లోనూ ఎవరూ తగ్గేదే లేదన్నట్టు ప్రవర్తించారు. హ్యాండ్ షేక్ వివాదంతో మొదలైన ఈ వివాదం ఆ తర్వాత ఇరు దేశాల అంతర్గత కలహాలలో జోక్యం చేసుకునే వరకు వెళ్ళింది. ఈ వివాదాల్లో టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ కూడా నిలిచాడు. లీగ్ దశలో పాకిస్థాన్ తో మ్యాచ్ గెలిచిన తర్వాత పహల్గామ్' ఎటాక్ కు గురైన బాధితుల గురించి మాట్లాడినందుకు సూర్యకుమార్ యాదవ్  మ్యాచ్ ఫీజ్ లో ఐసీసీ 30 శాతం జరిమానా విధించింది. 

ఆసియా కప్ ఫైనల్ తర్వాత సూర్య తన దేశ భక్తిని మరోసారి చాటుకున్నాడు. తనకు ఆటతో పాటు దేశం కూడా ముఖ్యమంటూ తన ఉదారతను చాటుకున్నాడు. మరోసారి పహల్గామ్ ఎటాక్ కు గురైన భాదితుల గురించి మాట్లాడుతూ ఇండియన్ ఆర్మీ గురించి గొప్పగా మాట్లాడి వార్తల్లో నిలిచాడు. టోర్నీలోని తన మ్యాచ్ ఫీజ్ మొత్తాన్ని భారత సైన్యానికి విరాళంగా ఇస్తున్నట్టు తెలిపాడు. " ఈ టోర్నీలో నా మ్యాచ్ ఫీజ్ మొత్తాన్ని ఇండియన్ ఆర్మీతో పాటు పెహల్గామ్ బాధితులకు విరాళంగా ఇవ్వాలనుకుంటున్నాను. మీరు ఎప్పుడూ నా ఆలోచనల్లో ఉంటారు". అని సూర్య తెలిపాడు. 

అసలేం జరిగిందంటే..?
 
ఆసియా కప్ ఫైనల్ కు ముందు టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ని ఐసీసీ హెచ్చరించింది. టోర్నీ లీగ్ మ్యాచ్ లో భాగంగా సెప్టెంబర్ 14న పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ 'పహల్గామ్' ఎటాక్ కు గురైన బాధితుల గురించి మాట్లాడాడు. క్రికెట్ లో రాజకీయానికి సంబంధించిన కామెంట్స్ చేసినందుకు ఐసీసీ నుంచి టీమిండియా కెప్టెన్ వార్నింగ్ అందుకున్నాడు. పాకిస్తాన్‌పై ఇండియా విజయం సాధించిన తర్వాత ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్న భారత సాయుధ దళాలకు తమ గెలుపును అంకితం చేస్తున్నట్టు సూర్య తెలిపాడు. సూర్యకుమార్ వ్యాఖ్యలు "రాజకీయ"మని పీసీబీ ఆరోపించి అతనిపై ఫిర్యాదు చేసింది. 

సూర్య ఆడకపోయినా టీమిండియా సూపర్ విక్టరీ: 

ఈ మ్యాచ్ విషయానికి వస్తే దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ లో పాకిస్థాన్ పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించి దాయాధి జట్టు పొగరు దించింది. స్వల్ప టార్గెట్ లో పాకిస్థాన్ పోరాడడంతో టీమిండియా విజయం కోసం చివరి ఓవర్ వరకు శ్రమించాల్సి వచ్చింది. తెలుగు బ్యాటర్ తిలక్ వర్మ (53 బంతుల్లో 69: 3 ఫోర్లు, 4 సిక్సర్లు) వీరోచిత ఇన్నింగ్స్ తో ఒంటిచేత్తో  ఇండియాను గెలిపించాడు. సంజు శాంసన్ (24), దూబే (33) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అంతకముందు కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు తీసుకొని పాకిస్థాన్ ను భారీ స్కోర్ చేయకుండా చేశాడు. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 19.1 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌటైంది. ఛేజింగ్ లో ఇండియా 19.4 ఓవర్లలలో 5 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసి మ్యాచ్ గెలిచింది.