Asia Cup 2025: సంజు ప్లేయింగ్ 11లో ఉంటాడా.. రిపోర్టర్‌కు సూర్య దిమ్మతిరిగే కౌంటర్

Asia Cup 2025: సంజు ప్లేయింగ్ 11లో ఉంటాడా.. రిపోర్టర్‌కు సూర్య దిమ్మతిరిగే కౌంటర్

ఆసియా కప్ నేటి నుంచి ప్రారంభం కానుంది. టోర్నీ తొలి మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ తో హాంగ్‌కాంగ్ తలపడనుంది. రెండు చిన్న జట్లు కావడంతో ఈ మ్యాచ్ కు పెద్దగా హైప్ లేదు. బుధవారం (సెప్టెంబర్ 10) ఇండియా మ్యాచ్ జరగనుండడంతో టీమిండియా ఫ్యాన్స్ ఈ మ్యాచ్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తో టీమిండియా ఆసియా కప్ లో తమ తొలి మ్యాచ్ ఆడనున్నారు. ఈ మ్యాచ్ లో టీమిండియా ఆడబోయే ప్లేయింగ్ 11 పై ఆసక్తి నెలకొంది. తొలి మ్యాచ్ కావడంతో 15 మందిలో ఎవరుంటారో ఒక అంచనాకు రావడం కష్టం. 

యూఏఈ తో జరగబోయే మ్యాచ్ లో టీమిండియా ప్లేయింగ్ 11 లో సంజు శాంసన్ ఉంటాడో లేదో అనే సస్పెన్స్ కొనసాగుతోంది. ఆసియా కప్ ముందు వరకు శాంసన్ స్థానానికి ఎలాంటి ప్రమాదం లేదు. అయితే వైస్ కెప్టెన్ గా గిల్ ఎంట్రీతో సంజు స్థానం ప్రస్నార్ధకంగా మారింది. ఓపెనర్ గా ఆడతాడా..? లేకపోతే మిడిల్ ఆర్డర్ లో ఆడిస్తారా..? అసలు ప్లేయింగ్ 11 లో ఉంటాడా..? అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఆసియా కప్ కు ముందు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లోనూ రిపోర్టర్ టీమిండియా ప్లేయింగ్ 11 లో సంజు శాంసన్ ఉంటాడా అని భారత కెప్టెన్ సూర్యను అడిగాడు. 

►ALSO READ | Asia Cup 2025: ఆఫ్ఘనిస్తాన్‌పై హాంగ్‌కాంగ్ కు రెండు విజయాలు.. హెడ్ టు హెడ్ రికార్డు ఇదే!

ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఇలా అడగడంతో సూర్య ఆశ్చర్యానికి గురయ్యాడు. అయితే అంతలోనే ఆ రిపోర్టర్ కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు. "సర్ ఆప్కో ప్లేయింగ్ XI మెసేజ్ కర్ దేతా హూన్ మైన్." (సర్, నేను మీకు ప్లేయింగ్ XI కి మెసేజ్ చేస్తాను.). శాంసన్ విషయంలో సానుకూలంగా ఉంటాము. మీరు బాధపడకండి. రేపు మేము సరైన నిర్ణయమే తీసుకుంటాము". అని సూర్య అన్నాడు. రేపటి మ్యాచ్ గురించి మాట్లాడుతూ.. "మైదానంలో మా  దూకుడు ఎప్పుడూ ఉంటుంది. దూకుడు లేకుండా మీరు క్రికెట్ ఆడలేరు. రేపటి నుండి మైదానంలోకి అడుగుపెట్టడానికి నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను." అని చెప్పాడు.