Asia Cup 2025: ఆఫ్ఘనిస్తాన్‌పై హాంగ్‌కాంగ్ కు రెండు విజయాలు.. హెడ్ టు హెడ్ రికార్డు ఇదే!

Asia Cup 2025: ఆఫ్ఘనిస్తాన్‌పై హాంగ్‌కాంగ్ కు రెండు విజయాలు.. హెడ్ టు హెడ్ రికార్డు ఇదే!

ఆసియా కప్ లో తొలి మ్యాచ్ పై ఆసక్తి నెలకొంది. నేడు (సెప్టెంబర్ 9) తొలి మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ తో హాంగ్‌కాంగ్ తలపడనుంది. ఈ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతోంది. అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. మ్యాచ్ సాయంత్రం 8 గంటలకు ప్రారంభమవుతుంది. రాత్రి 8 గంటల నుంచి సోనీ స్పోర్ట్స్ లో మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారమవుతుంది. తొలి మ్యాచ్ కావడంతో రెండు జట్ల మధ్య ఎలాంటి ఫైట్ జరగనుందో ఫ్యాన్స్ కు ఒక అంచనాకు రాలేకపోతున్నారు. ఆసియా కప్ లో ఆఫ్ఘనిస్తాన్, హాంగ్‌కాంగ్ హెడ్ టు హెడ్ రికార్డు ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం.. 

వచ్చే ఏడాది ఇండియా, శ్రీలంకలో జరగనున్న టీ20 ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ సంవత్సరం టోర్నమెంట్ టీ20 ఫార్మాట్‌లో జరుగుతోంది. 2016 తర్వాత తొలిసారి ఆఫ్ఘనిస్తాన్, హాంగ్‌కాంగ్ జట్లు తలబడుతున్నాయి. ఆసియా కప్ లో రెండు జట్లు టీ20 ఫార్మాట్‌లో ఆడడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఓవరాల్ గా ఈ రెండు జట్లు మధ్య ఐదు మ్యాచ్ లు జరిగాయి. వీటిలో ఆఫ్ఘనిస్తాన్ మూడు మ్యాచ్ ల్లో గెలిస్తే.. హాంగ్‌కాంగ్ రెండు మ్యాచ్ ల్లో విజయం సాధించింది. 2016 టీ20 వరల్డ్ కప్ లో నాగ్ పూర్ వేదికగా రెండు జట్లు చివరిసారిగా తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధించింది. 

హాంకాంగ్ vs అఫ్గానిస్తాన్ హెడ్-టు-హెడ్ రికార్డు
    
2016- ఆఫ్ఘనిస్తాన్- 6 వికెట్లు
2016- ఆఫ్ఘనిస్తాన్- 66 పరుగులు    
2015- హాంగ్ కాంగ్- 4 వికెట్లు
2015- హాంగ్ కాంగ్- 5 వికెట్లు    
2014- ఆఫ్ఘనిస్తాన్- 7 వికెట్లు


ఆఫ్ఘనిస్తాన్ స్క్వాడ్:

రషీద్ ఖాన్ (కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, దర్విష్ రసూలీ, సెడిఖుల్లా అటల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, కరీం జనత్, మహ్మద్ నబీ, గుల్బాదిన్ నైబ్, షరాఫుద్దీన్ అష్రఫ్, మహ్మద్ ఇషాక్, ముహమ్మద్ ఇషాక్ (వికెట్ కీపర్), ఫరీద్ మాలిక్, నవీన్-ఉల్-హక్, ఫజల్హాక్ ఫరూకీ

హాంకాంగ్:

యాసిమ్ ముర్తజా (కెప్టెన్), బాబర్ హయత్, జీషన్ అలీ (వికెట్ కీపర్), నియాజకత్ ఖాన్ మహ్మద్, నస్రుల్లా రాణా, మార్టిన్ కోయెట్జీ, అన్షుమాన్ రాత్ (వికెట్ కీపర్), కల్హన్ మార్క్ చల్లు, ఆయుష్ ఆశిష్ శుక్లా, మహ్మద్ ఐజాజ్ ఖాన్, అతీఖ్ ఉల్ రెహ్బాల్, ఖీన్‌చి ఇక్‌బాల్, మహ్మద్ ఐజాజ్ ఖాన్ మహ్మద్ అర్షద్, అలీ హసన్, షాహిద్ వాసిఫ్ (వికెట్ కీపర్), గజన్ఫర్ మహ్మద్, మహ్మద్ వహీద్, అనాస్ ఖాన్, ఎహ్సాన్ ఖాన్

►ALSO READ | Asia Cup 2025: ఆసియా కప్‌లో గ్రూప్-ఏ, గ్రూప్-బి షెడ్యూల్.. ఇండియా మ్యాచ్‌లు, టైమింగ్, స్ట్రీమింగ్, వేదికలు వివరాలు ఇవే!