చెన్నై: టీ20 వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్ వరల్డ్ రికార్డు పెర్ఫామెన్స్ చేసింది. ఛేజింగ్‌లో ఓపెనర్లు టిమ్ సిఫర్ట్ (42 బాల్స్‌లో 12 ఫోర్లు, 3 సిక్స్‌లతో 89 నాటౌట్), ఫిన్ అలెన్ (50 బాల్స్‌లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 84 నాటౌట్) దంచికొట్టడంతో మంగళవారం జరిగిన గ్రూప్–డి మ్యాచ్‌లో కివీస్ 10 వికెట్ల తేడాతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)పై గ్రాండ్ విక్టరీని సాధించింది.
టాస్ నెగ్గిన యూఏఈ 20 ఓవర్లలో 173/6 స్కోరు చేసింది. ముహమ్మద్ వసీం (45 బాల్స్‌లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 66 నాటౌట్), అలిషాన్ షరాఫ్ (47 బాల్స్‌లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 55) చెలరేగారు. తర్వాత కివీస్ 15.2 ఓవర్లలోనే 175/0 స్కోరు చేసి 28 బాల్స్ మిగిలి ఉండగానే ఈజీగా గెలిచింది. సిఫర్ట్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
కీలక భాగస్వామ్యం..
యూఏఈకి రెండో ఓవర్‌లోనే ఎదురుదెబ్బ తగిలింది. డఫీ (1/16) బౌలింగ్‌లో ఓపెనర్ ఆర్యన్ శర్మ (8) ఔటయ్యాడు. 12/1 వద్ద వసీమ్‌కు తోడైన షరాఫ్ మూడో ఓవర్‌లో రెండు ఫోర్లతో టచ్‌లోకి వచ్చాడు. ఆ వెంటనే వసీమ్ 6, 4తో పవర్‌ప్లేలో 50/1 స్కోరును అందించాడు. ఇక్కడి నుంచి ఈ ఇద్దరు క్రమం తప్పకుండా బౌండ్రీలు రాబట్టారు. రచిన్ రవీంద్రను లక్ష్యంగా చేసుకుని వసీమ్ సిక్స్ కొడితే, షరాఫ్ రెండు ఫోర్లు రాబట్టాడు.
ఫలితంగా ఫస్ట్ టెన్‌లో యూఏఈ 77/1 స్కోరు చేసింది. 12వ ఓవర్‌లో షరాఫ్ 4, 6తో వేగం పెంచాడు. ఈ క్రమంలో 39 బాల్స్‌లో ఫిఫ్టీ అందుకున్నాడు. ఆ వెంటనే మరో బౌండ్రీ కొట్టిన షరాఫ్‌ను 15వ ఓవర్‌లో శాంట్నర్ (1/23) వెనక్కి పంపాడు. రెండో వికెట్‌కు 107 రన్స్ కీలక భాగస్వామ్యం ముగిసింది. 8 బాల్స్ తర్వాత హర్షిత్ కౌశిక్ (2)ను ఫిలిప్స్ (1/30) ఔట్ చేశాడు.
37 బాల్స్‌లో హాఫ్ సెంచరీ చేసిన వసీమ్ 18వ ఓవర్‌లో 6, 4 కొట్టగా, మయాంక్ కుమార్ (21) 4, 6 రిపీట్ చేశాడు. ఈ ఓవర్‌లో 27 రన్స్ వచ్చాయి. తర్వాతి ఓవర్‌లో ఫోర్ కొట్టి మయాంక్ ఔటయ్యాడు. లాస్ట్ ఓవర్‌లో సిక్స్ కొట్టిన షోయబ్ ఖాన్ (7), మహ్మద్ అర్ఫాన్ (0)ను హెన్రీ (2/37) ఔట్ చేశాడు. చివరి ఐదు ఓవర్లలో యూఏఈ 4 వికెట్లు కోల్పోయి 51 రన్స్ చేసింది.
ఓపెనర్లే దంచేశారు..
ఛేదనలో కివీస్ ఓపెనర్లు అలెన్, సిఫర్ట్ యూఏఈ బౌలర్లను ఊచకోత కోశారు. తొలి ఓవర్‌లో మూడు రన్స్‌తో సరిపెట్టినా రెండో ఓవర్‌లో అలెన్, సిఫర్ట్ మూడు ఫోర్లు దంచారు. 4వ ఓవర్‌లో అలెన్ 6, 6, సిఫర్ట్ 4, 4 కొట్టారు. తర్వాతి ఓవర్‌లో 4, 6 వచ్చాయి. 6వ ఓవర్‌లో సిఫర్ట్ 4, 6, 4, 4తో 20 రన్స్ రాబట్టడంతో పవర్‌ప్లేలో కివీస్ స్కోరు 78/0కి చేరింది.
సిఫర్ట్ 23 బాల్స్‌లో హాఫ్ సెంచరీ చేయగా, తర్వాతి రెండు ఓవర్లలో అలెన్ 4, 6, 4తో 27 బాల్స్‌లో ఫిఫ్టీ మార్క్‌ను అందుకున్నాడు. సిఫర్ట్ మరో రెండు ఫోర్లతో 119/0 స్కోరుతో ఫస్ట్ టెన్ ఓవర్స్‌ను ముగించింది. 11వ ఓవర్‌లో సిఫర్ట్ 6, 4 , కొడితే ఆ తర్వాత అలెన్ 4, 6 దంచాడు.
చివరకు 16వ ఓవర్‌లో భారీ సిక్స్‌తో తొలి వికెట్‌కు 175 రన్స్ జోడించాడు. ఈ క్రమంలో అలెన్, సిఫర్ట్ వరల్డ్ రికార్డును నెలకొల్పి 28 బాల్స్ మిగిలి ఉండగానే కివీస్ చిరస్మరణీయ విజయాన్ని అందించారు.
సంక్షిప్త స్కోర్లు
టీ20 వరల్డ్ కప్‌లో ఏ వికెట్‌కైనా ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం (175*). 2022లో నెదర్లాండ్స్‌పై బట్లర్, హేల్స్ నెలకొల్పిన 170* రన్స్ పార్ట్ నర్‌షిప్‌ను బ్రేక్ చేశారు.
మెగా టోర్నీలో 10 వికెట్లతో గెలిచిన ఏడో మ్యాచ్ ఇది. ఆస్ట్రేలియా–శ్రీలంక (2007), సౌతాఫ్రికా–జింబాబ్వే (2012), ఒమన్–పీఎన్‌జీ (2021), పాక్–ఇండియా (2021), ఇంగ్లండ్–ఇండియా (2022), ఇంగ్లండ్–అమెరికా (2024) ముందున్నాయి.
28టీ20 వరల్డ్ కప్‌లో 150 రన్స్‌కి పైగా లక్ష్య ఛేదనలో ఇది మూడో అత్యుత్తమం (28 బాల్స్ మిగిలి ఉండగా). స్కాట్లాండ్X ఒమన్ (41 బాల్స్), నెదర్లాండ్స్X ఐర్లాండ్ (37) ముందున్నాయి.
