ICC: ఐసీసీ టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్గా సూర్య

ICC: ఐసీసీ టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్గా సూర్య

టీమిండియా విధ్వంసకర బ్యాటర్ మిస్టర్ 360 సూర్య కుమార్ యాదవ్ ను ఐసీసీ అవార్డు వరించింది. 2022 సంవత్సరానికిగాను ఐసీసీ మెన్స్ అంతర్జాతీయ టీ20 విభాగంలో పోటీపడిన సూర్యకు ‘క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు దక్కింది. 30 ఏళ్ల వయసులో కుర్రాళ్లతో పోటీ పడుతూ పరుగుల వరద పారిస్తున్నాడు. 2022లో సూర్య కేవలం 31 మ్యాచుల్లో 46.56 సగటు, 187.43 స్ట్రైక్ రేట్ తో 1164 పరుగులు చేశాడు. 2022లో టీ20 ఫార్మట్ లో అత్యధిక రన్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. గత ఏడాది మొత్తం 68 సిక్సర్లు బాదిన సూర్య.. రెండు సెంచరీలు, తొమ్మిది హాఫెసెంచరీలు నమోదు చేశాడు.