తుంగతుర్తి, వెలుగు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డిని సూర్యాపేట జిల్లా నూతన కాంగ్రెస్ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో వారిని కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు. జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించినందుకు వారికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.
