- టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి
సూర్యాపేట, వెలుగు: సూర్యాపేట మున్సిపాలిటీలోని 48 వార్డులను కైవసం చేసుకుని మున్సిపాలిటీపై కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేయాలని టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలో మున్సిపల్ ఎన్నికలపై పార్టీ నాయకులు, కార్యకర్తలతో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికలకు ఇచ్చిన హామీల మేరకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను పకడ్బందీగా అమలు చేస్తుందన్నారు.
సూర్యాపేటలోని పార్టీ బలంగా ఉందని, సంక్రాంతి పండుగ తర్వాత మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ రానుందని చెప్పారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాలను కైవసం చేసుకోవాలని, ఇందుకు తాను అండగా ఉంటానన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ రవిబాబు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పెద్దిరెడ్డి రాజా, ఓబిసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తండు శ్రీనివాస్, మార్కెట్ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్, డాక్టర్ రామ్మూర్తి, వెలుగు వెంకన్న, షఫీ ఉల్లా, దేవేందర్, ఫరూక్ తదితరులు పాల్గొన్నారు.
