- సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య
తుంగతుర్తి, వెలుగు: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య అన్నారు. ఆదివారం తుంగతుర్తి మండల పరిధిలోని వెలుగు పల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ గా పోటీ చేసిన సోలిపురం అశ్విని కన్నా రెడ్డి తరఫున ఇంటింటి ప్రచారం చేసి మాట్లాడారు. కాంగ్రెస్ ద్వారానే గ్రామ అభివృద్ధి జరుగుతుందన్నారు.
పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం పూర్తిగా వెనకబడిందన్నారు. పేదలకు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తూ పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ సర్కార్ పాటుపడుతోందన్నారు. స్థానిక ఎమ్మెల్యే మందుల సామెల్ సహకారంతో గ్రామాల్లోని రోడ్లు బాగుపడుతున్నాయన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కృష్ణ. నవీన చారి, వెంకన్న, వీరయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
