ఆవు కడుపులో 100 కేజీల ప్లాస్టిక్ కవర్లు.. ఆపరేషన్ చేసి తీసిన సూర్యపేట జిల్లా వైద్యులు

ఆవు కడుపులో 100 కేజీల ప్లాస్టిక్ కవర్లు.. ఆపరేషన్ చేసి తీసిన సూర్యపేట జిల్లా వైద్యులు

మనిషి చేసిన పనులకు మూగజీవాలు ఎలా బలవుతున్నాయో ఈ వార్త ఒక ఉదాహరణ. విపరీతమై ప్లాస్టిక్ వాడకంతో పర్యావరణం దెబ్బతింటోందని ఐక్యరాజ్య సమితి, పర్యావరణ వేత్తలు ఆందోళన చెందుతున్న వేళ.. పశుపక్షాదులు కూడా ఈ ప్లాస్టిక్ మహమ్మారి బారిన పడి నష్టపోతున్న విషయాలో కోకొల్లలు. అయితే లేటెస్ట్ గా సూర్యాపేట జిల్లాలో ఆవు కడుపులో వంద కేజీల ప్లాస్టిక్ కవర్లు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. 

ఆవు కడుపులో నుంచి దాదాపు వంద కేజీల ప్లాస్టిక్ వ్యర్ధాలను సర్జరీ చేసి తొలగించారు పశు వైద్యులు. సుమారు ఐదుగంటలు శ్రమించి ఆపరేషన్ చేసి వ్యర్థాలను బయటకు తీశారు.  అన్ని కవర్లు కడుపులో ఉండటంతో ఎంత ఇబ్బందిపడిందో ఆ మూగజీవి. ఆపరేషన్ ద్వారా తొలగిస్తుంటే మాత్రం తల్లడిల్లింది. రోడ్లపై పడేసిన కవర్లు, వైర్లనును గడ్డి మేసే క్రమంలో తిని అస్వస్థతకు గురైంది ఆవు. దీంతో వైద్యులు సర్జరీ చేసి ఆవును బతికించారు. 

ALSO READ : పండగకి ముందు షాకిస్తున్న బంగారం, వెండి.. 

ప్రభుత్వాలు ప్లాస్టిక్ కవర్లను  నిషేధించినప్పటికీ రోడ్లపై పడేస్తున్నారు ప్రజలు. ఒకవైపు నిషేధం ఉన్నా.. కంపెనీలు ఉత్పత్తులు ఆపడం లేదు. ప్రతి అవసరానికి ఎక్కడైనా అందుబాటులో ఉంటుండటంతో కవర్లను వినియోగిస్తూ రోడ్లపై పడేస్తున్నారు. దీంతో మూగజీవాలను వాటిని తిని అనారోగ్యానికి గురవుతున్నాయి. 

 సొసైటీలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా అధికారులు  కోరుతున్నారు. ప్లాస్టిక్ కవర్లను, వ్యర్ధాలను రోడ్లపై పడవేయకూడదు అని సూచిస్తున్నారు.