రూ. కోటి 25 లక్షల విలువైన గంజాయిని తగలబెట్టిన పోలీసులు

రూ. కోటి 25 లక్షల విలువైన గంజాయిని తగలబెట్టిన పోలీసులు

సూర్యాపేట: రూ. కోటి 25 లక్షల విలువైన గంజాయిని జిల్లా పోలీసులు తగలబెట్టారు. జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఛైర్మెన్, ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం... జిల్లా వ్యాప్తంగా మొత్తం 48 గంజాయి కేసులు నమోదు అయ్యాయి. ఈ సందర్భంగా దాదాపు 12 క్వింటాళ్ల 50 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం గంజాయిని సీజ్ చేసిన అధికారులు... కోర్టు ఆదేశాల మేరకు మంగళవారం చివ్వెంల మండల పరిధిలోని ఉండ్రుగొండ గట్టు అటవీ ప్రాంతంలో  ఆ గంజాయిని తగలబెట్టారు. గంజాయి వల్ల సమాజానికి, యువతకు నష్టం వాటిల్లుతోందని ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. అక్రమంగా గంజాయి సాగు చేసినా, రవాణా చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.