నల్గొండ జిల్లా: నకిరేకల్ పట్టణంలో కారు బీభత్సం సృష్టించింది. మితిమీరిన వేగంతో వచ్చిన కారు ఆగి ఉన్న రెండు బైకులు, తోపుడు బండి పైకి అదుపు తప్పి దూసుకెళ్లింది. మసీదు ముందు ఆగి ఉన్న వ్యక్తి పైకి దూసుకెళ్లింది. అయితే ఈ ఘటనలో ప్రాణాపాయం తప్పింది. కారు ఢీ కొట్టిన ధాటికి రెండు బైక్‌లతో పాటు ఒక తోపుడు బండి పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాదంలో బైక్‌పై ఉన్న వ్యక్తితో పాటు కారులో ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
108 అంబులెన్స్‌లో బాధితులను నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కారు అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. నకిరేకల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ కారు ఎక్కడ నుంచి ఎక్కడకు వెళుతుందో.. కారు డ్రైవింగ్ చేసిన వ్యక్తి మద్యం మత్తులో ఉన్నారో.. లేదో పోలీసులు ఆరా తీస్తున్నారు. లేచిన వేళ మంచిగా ఉందని.. ప్రాణాలు దక్కాయని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
