'మా నీళ్ల ట్యాంక్' టీజర్ రిలీజ్

'మా నీళ్ల ట్యాంక్' టీజర్ రిలీజ్

టాలీవుడ్ హీరో సుశాంత్, ప్రియా ఆనంద్ మెయిన్ లీడ్ లో లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో తెరకెక్కుతోన్న వెబ్ సిరీస్ 'మా నీళ్ల ట్యాంక్'. ఇంట్రెస్టింగ్ టైటిల్ తో రూపోందుతున్న ఈ వెబ్ సిరీస్ నుండి టీజర్ రిలీజైంది. ఒక చిన్న గ్రామంలో పనికిరాని వాటర్ ట్యాంక్‌ చుట్టూ నడిచే కథతో, సరదా సరదా సన్నివేశాలతో టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది.  జీ5 సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సుశాంత్‌ సబ్‌ ఇన్‌ స్పెక్టర్‌గా నటిస్తుండగా, పల్లెటూరు అమ్మాయిగా ప్రియా ఆనంద్ కనిపిస్తోంది.  మొత్తం ఎనిమిది ఎపిసోడ్స్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ వెబ్‌ సీరిస్‌ జులై 15 నుంచి జీ 5లో స్ట్రీమింగ్‌ కాబోతోంది.  ఈ వెబ్ సిరీస్ పైన ప్రేక్షకులలో మంచి అంచనాలే ఉన్నాయి.