పంత్ను కాపాడిన బస్ డ్రైవర్కు సన్మానం

పంత్ను కాపాడిన బస్ డ్రైవర్కు సన్మానం

టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ ప్రాణాలను కాపాడిన హర్యానా రోడ్వేస్ బస్ డ్రైవర్ సుశీల్ మాన్‌ను ఉత్తరాఖండ్ ప్రభుత్వం జనవరి 26న గౌరవించనుంది. ఉత్తరాఖండ్, రూర్కీ సమీపంలో డిసెంబరు 30న జరిగిన రోడ్డు ప్రమాదంలో రిషబ్ పంత్ కు తీవ్రగాయాలయ్యాయి. పంత్ ను  బస్ డ్రైవర్ సుశీల్ మాన్  కండక్టర్ పరంజీత్‌తో కలిసి రక్షించారు. సుశీల్ చేసిన పనికి సోషల్ మీడియాలో అందరూ రియల్ హీరో అని కొనియాడుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే గమనించి కావాల్సిన సాయం అందించిన సుశీల్ మాన్‌, ఆ బస్సు కండక్టర్ పరంజీత్ ని గుడ్ సమరిటన్ స్కీమ్ కింద సత్కరించారు.

ఈ ఇద్దరికి రూ.5వేలు బహుమతిగా అందించారు. ప్రస్తుతం పంత్‌ డెహ్రాడూన్‌లోని మ్యాక్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. తదుపరి చికిత్స కోసం ఆయన్ను  ఢిల్లీలోని ఓ ఆసుపత్రికి విమానంలో తరలించే అవకాశం ఉందని సమాచారం. ఈ ఘటన తర్వాత పంత్ కుటుంబాన్ని సంప్రదించినందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీకి బీసీసీఐ కృతజ్ఞతలు తెలిపింది. పంత్ ఫేస్ పై గాయాలు కావడంతో..డెహ్రడూన్ లోని మ్యాక్స్ ఆసుపత్రిలో అతనికి ప్లాస్టిక్ సర్జరీ చేసినట్లు ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ డైరెక్టర్ శ్యామ్ తెలిపారు.