
హైదరాబాద్ లో 2017లో జరిగిన గ్లోబర్ ఆంట్రప్రెన్యూస్ సమ్మిట్ లో విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ పాల్గొని ప్రసంగించారు. అమెరికా, భారత్ ఉమ్మడి సహకారంతో నిర్వహించిన ఈ సదస్సు ఎంతోమంది ఆవిష్కర్తలకు వేదిక కావాలని ఆకాంక్షించారు. మాటల సందర్భంలో… “తెలంగాణ యువతలోనూ ఎంతో ప్రతిభ దాగుంది. తెలంగాణ చిన్నమ్మగా చెబుతున్నా… అవకాశాలను రాష్ట్రవాసులంతా అందుకుని విజయం సాధించండి” అని ఆమె ఆకాంక్షించారు.
సుష్మాస్వరాజ్ భౌతికంగా లేకున్నా.. ఆమె చెప్పిన మాటలు మాత్రం తెలంగాణ ప్రజలు ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటారు. యూపీఏ హయాంలో.. లోక్ సభలో ప్రతిపక్ష నాయకురాలిగా, బీజేపీ పార్లమెంటరీ పార్టీ నాయకురాలిగా.. తెలంగాణ పోరాటాన్ని ఆమె ముందుండి నడిపించారు. ఎన్నోసార్లు తెలంగాణ అమరవీరుల త్యాగాలను పార్లమెంట్ లో గుర్తుచేశారు. ఆ త్యాగాలను గౌరవిస్తూ… ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని యూపీఏకు సూచించారు.