చర్చలపై కొనసాగుతున్న సస్పెన్స్

చర్చలపై కొనసాగుతున్న సస్పెన్స్

ఉక్రెయిన్పై రష్యా దాడులు వరుసగా ఎనిమిదో రోజు కొనసాగుతున్నాయి. దేశంలోని పెద్ద నగరాలను తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు రష్యా బలగాలు ప్రయత్నిస్తున్నాయి. ఉద్రిక్తతలను తొలగించేందుకు చర్చలు జరపాలని ఇరు దేశాలు నిర్ణయించినా ఎప్పుడు ఎక్కడ అనేది ఇంకా తేలలేదు. బెలారస్ వేదికగా ఇరు దేశాల అధికారులు భేటీ కానున్నట్లు తెలుస్తోంది. చర్చలకు తాము సిద్ధమని అయితే ముందుగా దాడులు ఆపాలని ఉక్రెయిన్ చెబుతుండగా.. తమ డిమాండ్లలో మార్పు లేదని రష్యా స్పష్టం చేసింది. 

ఇదిలా ఉంటే ఉక్రెయిన్పై రష్యా దాడులు నిలిపివేయాలంటూ ఐక్యరాజ్యసమితో మరో తీర్మానం ప్రవేశపెట్టారు. 193 సభ్యదేశాల్లో 141 అనుకూలంగా ఓటు వేయగా.. 5 దేశాలు తీర్మానాన్ని వ్యతిరేకించాయి. భారత్ సహా 35 దేశాలు ఓటింగ్ కు దూరంగా ఉన్నాయి. 

For more news..

భారత్‌లో భారీగా తగ్గిన కరోనా కేసులు

8వ క్లాస్ వరకు ఇంగ్లీష్ మీడియం