ములుగు మహిళా, శిశు సంక్షేమ శాఖ సీనియర్‌‌‌‌‌‌‌‌ అసిస్టెంట్‌‌‌‌‌‌‌‌ సస్పెన్షన్‌‌‌‌‌‌‌‌

ములుగు మహిళా, శిశు సంక్షేమ శాఖ సీనియర్‌‌‌‌‌‌‌‌ అసిస్టెంట్‌‌‌‌‌‌‌‌ సస్పెన్షన్‌‌‌‌‌‌‌‌

ములుగు, వెలుగు : విధుల్లో నిర్లక్ష్యం వహించడంతో పాటు, ప్రభుత్వ ఆదేశాలను సైతం పట్టించుకోని ములుగు జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ సీనియర్‌‌‌‌‌‌‌‌ అసిస్టెంట్‌‌‌‌‌‌‌‌ నాగేంద్రపై సస్పెన్షన్‌‌‌‌‌‌‌‌ వేటు పడింది. మాదకద్రవ్యాల నిర్మూలన కోసం రాష్ట్ర ప్రభుత్వం జూన్‌‌‌‌‌‌‌‌ 26న ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో భాగంగా ప్రజాప్రతినిధులు, ప్రజలు

రాజకీయ నాయకులు, వివిధ శాఖల అధికారులతో కార్యక్రమ నిర్వహించడంతో పాటు టీషర్ట్‌‌‌‌‌‌‌‌లు, టోపీలు, పోస్టర్లు ఏర్పాటు చేసేందుకు రూ. 30 వేలు కేటాయించారు. అయితే కార్యక్రమ నిర్వహణలో సీనియర్‌‌‌‌‌‌‌‌ అసిస్టెంట్‌‌‌‌‌‌‌‌ నాగేంద్ర విఫలం అయ్యాడని ఆరోపణలు రావడంతో అతడిని సస్పెండ్‌‌‌‌‌‌‌‌ చేస్తూ కలెక్టర్‌‌‌‌‌‌‌‌ దివాకర్‌‌‌‌‌‌‌‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.