మహారాష్ట్రలో బాంబు పేలి ట్రక్కు డ్రైవర్‌ మృతి

మహారాష్ట్రలో బాంబు పేలి ట్రక్కు డ్రైవర్‌ మృతి

మహారాష్ట్ర కొల్హాపూర్‌లో బాంబు పేలుడు జరిగింది. ఒక ట్రక్కులో గుర్తు తెలియని వ్యక్తులు అమర్చిన బాంబు పేలడంతో ట్రక్కు డ్రైవర్‌ అక్కడిక్కడే చనిపోగా…మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాజకీయ పక్షాలు ప్రచారం సందడిలో ఉండగా ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంలనం సృష్టించింది. ఓ ట్రక్కు డ్రైవర్‌ తన స్నేహితుడితో కలిసి వాహనంలో వచ్చి బండిని రోడ్డు పక్కగా ఆపాడు. ట్రక్కులోనే కూర్చుని  ఇద్దరూ మాట్లాడుకుంటుండగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. దాంతో డ్రైవర్‌ అక్కడిక్కడే చనిపోగా, తీవ్రంగా గాయపడిన అతని స్నేహితుడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని బాంబు డిస్పోజల్‌ స్క్వాడ్‌ తనిఖీ చేసింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మృతుడి స్నేహితుడిని సంఘటనపై అధికారులు ప్రశ్నిస్తున్నారు.