ఆస్ట్రేలియాలో షాద్నగర్ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. షాద్‌నగర్ కు చెందిన అరటి కృష్ణ ఏకైక కుమారుడు అరవింద్ యాదవ్ (30) ఉద్యోగరీత్యా సిడ్నీలో స్థిరపడ్డాడు. 12 ఏళ్లుగా అక్కడే ఉంటున్నాడు.16 నెలల క్రితం వివాహం అయింది. వివాహం తర్వాత భార్య, తల్లితో కలిసి ఆస్ట్రేలియా వెళ్లాడు.
ఆస్ట్రేలియాలో వాతావరణం పడకపోవడంతో ఇండియాకు వచ్చేందుకు టికెట్లు బుక్ చేసుకున్నాడు. కారు వాష్ చేయించుకుని వస్తానని చెప్పిన అరవింద్ 5 రోజులైన తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆస్ట్రేలియా పోలీసులను ఆశ్రయించారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. అరవింద్ సముద్రంలో శవమై కనిపించాడు. ఇది హత్యా ? లేక ఆత్మహత్యా ?అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. అరవింద్ భార్య ప్రస్తుతం గర్భిణి.
