బెంగాల్లో 1.25 కోట్ల అక్రమ ఓటర్లు .. సువేందు అధికారి ఆరోపణ

బెంగాల్లో 1.25 కోట్ల అక్రమ ఓటర్లు .. సువేందు అధికారి ఆరోపణ

కోల్​కతా: బెంగాల్ ఓటర్ల లిస్ట్​లో 1.25 కోట్ల మంది అక్రమ వలసదారులు ఉన్నారని రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి ఆరోపించారు. ఓటర్ లిస్ట్ స్పెషల్ ఇంటెన్సివ్​ రివిజన్(ఎస్ఐఆర్) తర్వాత వారిని వెనక్కి పంపుతామని ఆయన తెలిపారు. పుర్బా మెదినీపూర్ జిల్లాలోని తమ్లుక్‌‌‌‌ లో జరిగిన ఒక కార్యక్రమంలో సువేందు అధికారి ప్రసంగించారు. 

మతపరమైన హింస వల్ల ఆశ్రయం కోరి వచ్చిన హిందువులు ఈ ప్రక్రియ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు.