కోల్‌కతా: బెంగాల్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన సువేందు అధికారి సరికొత్త రాజకీయ శకానికి నాంది పలికారు. గతంలో మాదిరిగా రాష్ట్రంలో ‘భయానక వాతావరణం’ (భోయ్) ఉండదని, ‘విశ్వాసం’ (భోర్సా) వెల్లివిరుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన తన స్వగ్రామమైన పూర్బ మేదినీపూర్ జిల్లా 'కాంతి'కి చేరుకున్నారు. రాష్ట్రంలో భయం పోయి విశ్వాసం నెలకొంటుందని ప్రధాని మోదీజీ ముందే హామీ ఇచ్చారన్నారు.
