Suzlon Stock: నేడు 13 శాతం పెరిగిన సుజ్లాన్ స్టాక్.. క్యూ4 లాభాలతో జోరు..

Suzlon Stock: నేడు 13 శాతం పెరిగిన సుజ్లాన్ స్టాక్.. క్యూ4 లాభాలతో జోరు..

Suzlon Energy Shares: రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో పెరుగుతున్న కొత్త పెట్టుబడులు, ప్రాజెక్టులతో సుజ్లాన్ ఎనర్జీ షేర్లకు భారీగా డిమాండ్ పెరుగుతోంది. అలాగే గడచిన కొన్ని త్రైమాసికాలుగా కంపెనీ ఆదాయాలు, లాభాలు ఉహించినదాని కంటే మెరుగ్గా ఉండటం ఇన్వెస్టర్లను ఎక్కువగా ఆకర్షిస్తోంది. 

ఈ క్రమంలోనే సుజ్లాన్ తాజాగా విడుదల చేసిన నాల్గవ త్రైమాసిక ఫలితాలు మార్కెట్లో పెద్ద ర్యాలీకి ఆజ్యం పోశాయి. గత ఏడాది ఇదే త్రైమాసికం కంటే నికర లాభం 365 శాతం పెరిగి రూ.వెయ్యి 181 కోట్లకు చేరుకోవటం ఆశ్చర్యానికి గురిచేంది. గత ఆర్థిక సంవత్సరం కంపెనీ ఇదే కాలంలో రూ.245 కోట్ల నికర లాభాన్ని మాత్రమే నమోదు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం భారీగా లాభం పెరగటానికి కారణం వాయిదా పడిన పన్ను లాభం ద్వారా రూ.600 పెరిగినట్లు కంపెనీ వెల్లడించింది. ఇదే క్రమంలో మార్చి త్రైమాసికంలో మెుత్తం ఆదాయం 73.2 శాతం పెరిగి ఏడాది ప్రాతిపదికన రూ.3వేల 773 కోట్లుగా నమోదైంది. 

ఇన్వెస్టర్లతో పాటు మార్కెట్ల ఊహకు సైతం అందనీ భారీ లాభాలను మార్చి త్రైమాసికంలో కంపెనీ నమోదు చేయటంతో నేడు ఇంట్రాడేలో స్టాక్ 13 శాతం వరకు పెరుగుదలను చూసింది. అయితే ఉదయం 10.10 గంటల సమయంలో స్టాక్ 10 శాతానికి పైగా లాభంతో రూ.72 స్థాయి వద్ద తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. దీంతో కంపెనీ షేర్ల ధర 6 నెలల గరిష్ఠాన్ని తాకింది. ఇదే క్రమంలో విండ్ ఎనర్జీ కంపెనీ షేర్లను విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు 2కోట్ల 19 లక్షలు కొనుగోలు చేసినట్లు వెల్లడైంది. 

బ్రోకరేజీల మాటేంటి..
ప్రస్తుతం కంపెనీ షేర్లు తమ గరిష్ఠాలకు చేరువలో ట్రేడింగ్ కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే చాలా మంది ఇన్వెస్టర్లు ఈ సమయంలో సుజ్లాన్ షేర్లలో పెట్టుబడి పెట్టొచ్చా, దానికి ఉన్న అవకాశాలపై వెతుకుతున్నారు. ఈ క్రమంలో అసలు మార్కెట్లో నిపుణులు కంపెనీ షేర్ల భవిష్యత్తు ర్యాలీపై ఎలా ఉన్నారనే విషయం గమనిద్దాం.

* దేశీయ బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వార్ సుజ్లాన్ స్టాక్ టార్గెట్ ధరను రూ.75గా పేర్కొంటు కొనుగోలు రేటింగ్ అందించింది.
* ఇదే క్రమంలో జేఎమ్ ఫైనాన్షియల్ కంపెనీ షేర్లను కొనుగోలు చేయెుచ్చంటూ టార్గెట్ ధరను రూ.71గా పేర్కొంది. 
* మోర్గన్ స్టాన్లీ సుజ్లాన్ షేర్లకు ఓవర్ వెయిట్ రేటింగ్ ఇస్తూ టార్గెట్ ధరను రూ.73గా ఫిక్స్ చేసింది. 

NOTE: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటి ఆధారంగా ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోల్లో పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకోవటానికి ముందుగా మీ ఆర్థిక సలహాదారులను సంప్రదించటం ఉత్తమం. మీరు తీసుకునే నిర్ణయాలకు V6 యాజమాన్యం లేదా ఉద్యోగులు ఎట్టిపరిస్థితుల్లోనూ బాధ్యత వహించరు.