
సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా తన 125సీసీ స్కూటర్ అవెనిస్‌ను బోల్డ్ డ్యూయల్-టోన్ కలర్స్‌తో విడుదల చేసింది. స్టాండర్డ్ వేరియంట్ ధర రూ.91,400 కాగా, రైడ్ కనెక్ట్ ఎడిషన్ ధర రూ.93,200 (ఎక్స్-షోరూమ్).
124.3 సీసీ సింగిల్-సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజన్ 8 బీహెచ్‌పీ పవర్, 10 ఎన్‌ఎం టార్క్‌ను అందిస్తుంది. బీఎస్–6 ఓబీడీ-2బీ కంప్లయెంట్, సుజుకి ఎకో పెర్ఫార్మెన్స్ (ఎస్‌ఈపీ) టెక్నాలజీతో ఇంధన సామర్థ్యం, పనితీరు మెరుగుపడిందని కంపెనీ చెబుతోంది.
ఇది యమహా రేజర్, హోండా డియో 125, టీవీఎస్ ఎన్‌టార్క్‌తో పోటీపడుతుంది. డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఎల్‌ఈడీ లైట్స్, స్ప్లిట్ గ్రాబ్ రైల్స్, 21.8-లీటర్ స్టోరేజ్, యూఎస్‌బీ ఛార్జర్, సైడ్ స్టాండ్ ఇంటర్‌లాక్, సీబీఎస్ వంటి ఫీచర్లు ఉన్నాయి.