2030 లోపు 6 కరెంటు కార్లు తెస్తాం : జపాన్​ సుజుకి కార్ప్​

2030 లోపు 6 కరెంటు కార్లు తెస్తాం : జపాన్​ సుజుకి కార్ప్​

జపాన్​ సుజుకి కార్ప్​ ప్రకటన

న్యూఢిల్లీ : ఇండియాలో 2030 లోపు ఆరు ఎలక్ట్రిక్​ కార్లను తేనున్నట్లు జపాన్​ కంపెనీ సుజుకి మోటార్​ కార్పొరేషన్​ గురువారం ప్రకటించింది. గ్రోత్​ స్ట్రేటజీలో భాగంగా ఈ నిర్ణయాన్ని కంపెనీ తీసుకుంది. సుజుకి మోటార్​ కార్పొరేషన్‌‌‌‌ ​ మన దేశంలో మారుతి సుజుకి ఇండియా ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. జపాన్​ సంస్థ గ్రోత్​ స్ట్రేటజీని ఇండియాలోని మారుతి సుజుకి బీఎస్ఈకి పంపించింది.

2030 నాటికి పోర్ట్​ఫోలియోలో 15 శాతం బ్యాటరీ ఈవీలు ఉండేలా చొరవ తీసుకోనున్నట్లు సుజుకి మోటార్​ కార్పొరేషన్​ వెల్లడించింది. 2023 ఆటో ఎక్స్​పోలో ప్రదర్శనకు పెట్టిన బ్యాటరీ ఎస్​యూవీని ఇండియా మార్కెట్లో 2024 లో లాంఛ్​ చేయనున్నట్లు తెలిపింది. ఇండియాలో బయోగ్యాస్​ బిజినెస్ ​పైనా ఫోకస్​ పెట్టనున్నట్లు ఈ జపాన్​ కంపెనీ పేర్కొంది.