
- స్వేరో స్టూడెంట్ యూనియన్
హైదరాబాద్, వెలుగు : ఇంజనీరింగ్ కాలేజీల ఫీజు దోపిడీని అరికట్టాలని స్వేరో స్టూడెంట్ యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్ మొగిలిపాక నవీన్ కోరారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం నవీన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల ఫీజు దోపిడీ ఏటా పెరిగిపోతోందని ఆరోపించారు.
మేనేజ్మెంట్సీట్లకు రూ.లక్షలు వసూలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఫీజు దోపిడీపై ప్రశ్నించే నాథుడే కరువయ్యాడని, బి– కేటగిరి సీట్లను కౌన్సిలింగ్ ద్వారా నింపాలని డిమాండ్చేశారు. మిడిల్ క్లాస్స్టూడెంట్లు ఇంజనీరింగ్విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
బి– కేటగిరి సీట్లకు కౌన్సిలింగ్నిర్వహించకుంటే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. నవీన్వెంట విద్యార్థి నాయకులు సిద్ధార్థ్, ప్రకాష్, అజయ్, సాగర్, శ్రవణ్ పాల్గొన్నారు.