స్వామిజీ కిడ్నాప్.. రూ. 20 కోట్లు, కిలో బంగారం డిమాండ్

స్వామిజీ కిడ్నాప్.. రూ. 20 కోట్లు, కిలో బంగారం డిమాండ్

కర్ణాటకలో అమ్మాజీ అనే స్వామిజీ కిడ్నాప్ కలకలంరేపింది. బార్లీ జిల్లా కపిలాపూర్ గ్రామం నుంచి స్వామిజీని దుండగులు కిడ్నాప్ చేశారు. విమానంలో షిరిడి వెళ్దామని నమ్మించి భాస్కర్ రెడ్డి, సతీష్ అనే ఇద్దరు కిడ్నాపర్లు ఓ కారులో హైద్రాబాద్ తీసుకొచ్చారు. అక్కడి నుంచి శంషాబాద్ మీదుగా బెంగుళూరుకు తీసుకొని వెళ్లారు. అక్కడ స్వామిజీని ఓ గదిలో బంధించి.. రూ. 20 కోట్ల నగదు, కిలో బంగారం గానీ లేకపోతే పది ఎకరాల వ్యవసాయం భూమి కానీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాము అడిగింది ఇవ్వకపోతే స్వామిజీ కుటుంబాన్ని చంపేస్తామని బెదిరించారు. దాంతో స్వామిజీ కిడ్నాపర్లకు రూ. 5 కోట్లు ఇస్తానని ఒప్పుకోవడంతో తిరిగి హైద్రాబాద్‌కు తీసుకొచ్చారు. హైద్రాబాద్ చేరుకోగానే గుండె నొప్పి వస్తుందని స్వామిజీ నాటకం ఆడారు. దాంతో కిడ్నాపర్లు వెంటనే స్వామిజీని ఆస్పత్రికి తీసుకెళ్ళారు. అక్కడ స్వామిజీ కిడ్నాపర్ల గురించి వైద్యుని ద్వారా లంగర్ హౌజ్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. ఆస్పత్రికి చేరుకున్నారు. స్వామిజీ ఆస్పత్రి సిబ్బందితో కలిసి కిడ్నాపర్లను పట్టుకొని లంగర్ హౌజ్ పోలీసులకు అప్పగించారు. కానీ సీఐ కావాలనే కిడ్నాపర్లను వదిలేశాడని స్వామిజీ ఆరోపిస్తున్నారు. కిడ్నాపర్ల చెరలో ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని వారం రోజులు బిక్కు బిక్కుమంటూ గడిపానని స్వామిజీ అన్నారు. కిడ్నాపర్లు తనని మానసికంగా, శారీరకంగా హింసించారని ఆయన తెలిపారు.

For More News..

బిల్డింగులు కట్టుకోండి.. ఎవడు ఆపుతడో చూస్తా.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే

ఫోన్ ఉంటేనే రేషన్.. బయోమెట్రిక్ బదులు ఓటీపీ సిస్టమ్

హోం ట్యూషన్లకు ఫుల్ డిమాండ్​.. నెలకు రూ. 3 నుంచి 15 వేలు

V6 రేటింగ్​పై కుట్ర.. రేటింగ్​ పెరగకుండా ప్రయత్నాలు