కేరళ హైకోర్టులో స్వప్నా సురేష్‌  బెయిల్‌ పిటిషన్ 

కేరళ హైకోర్టులో స్వప్నా సురేష్‌  బెయిల్‌ పిటిషన్ 

తిరువనంతపురం : కేరళ గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసులో ప్రధాన నిందితురాలు స్వప్నా సురేష్‌ సోమవారం (జూన్ 27న) హైకోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. మాజీ మంత్రి కేటీ జలీల్‌ ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో ఆమె ముందస్తు బెయిల్‌ కోసం కోర్టును ఆశ్రయించారు. బంగారం అక్రమ రవాణా కేసులో స్వప్నా సురేశ్‌ తనపై చేసిన ఆరోపణలపై విచారణ జరిపించాలని, తనపై కుట్ర పన్నడంతో పాటు పరువుకు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ కేటీ జలీల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తిరువనంతపురం కంటోన్మెంట్‌ పోలీసులు స్వప్నా సురేష్‌పై కేసు నమోదు చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఈ నెల 23వ తేదీన స్వప్నా సురేష్‌ను ఈడీ అధికారులు బంగారం స్మగ్లింగ్‌ కేసుకు సంబంధించి.. దాదాపు ఐదున్నర గంటల పాటు విచారించారు. అంతకు ముందు రోజు సైతం ఈడీ ప్రశ్నించింది. ఈ కేసులో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై స్వప్నా సురేష్‌ ఆరోపణలు చేశారు. దీంతో సీఎం రాజీనామా చేయాలంటూ ప్రతిపక్ష పార్టీలు నిరసనలకు దిగాయి.