నా డివోర్స్ గురించి మీకెందుకు చెప్పాలి.. సీరియస్ అయిన స్వాతి.

నా డివోర్స్ గురించి మీకెందుకు చెప్పాలి.. సీరియస్ అయిన స్వాతి.

నటి స్వాతి(Swathi) డివోర్స్ విషయంపై కొంత కాలంగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే ఈ వార్తలపై అటు స్వాతి గానీ తన భర్త గానీ రెస్పాండ్ అవలేదు. తాజాగా మరోసారి స్వాతి విడాకుల విషయం తెరపైకి వచ్చింది. 

స్వాతి ప్రధాన పాత్రలో వస్తున్న మూవీ ‘మంత్ అఫ్ మధు’ (Month of Madhu). నవీన్ చంద్ర హీరోగా వస్తున్న ఈ సినిమా అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ప్రమోషన్స్ లో భాగంగా సెప్టెంబర్ 26న ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సందర్బంగా మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు చిత్ర యూనిట్. ఈ క్రమంలో ఒక రిపోర్టర్ స్వాతి విడాకుల విషయం గురించి ప్రస్తావిస్తూ దానిపై క్లారిటీ ఇవ్వాల్సిందిగా కోరారు. దానికి సమాధానంగా స్వాతి.. నేను ఇవ్వను.. నేను చెప్పను.. నేను ఎందుకు రియాక్ట్ అవ్వాలి అంటూ సీరియస్ అయ్యారు. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

Also Read :- నటి వహీదా రెహమాన్‌కు దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు

అయితే.. కొంత కాలంగా స్వాతి తన భర్తతో దూరంగా ఉంటోందని, ఆ కారణంగానే ఇంస్టాగ్రామ్ లో తన పెళ్ళికి సంబందించిన ఫోటోలను హైడ్ చేశారని, ఈ క్రమంలోనే వారి విడాకులు తీసుకోనున్నారు అనే వార్తలు పుట్టుకొచ్చాయి. ఇదే విషయాన్ని ఆమె దగ్గర ప్రస్తావించగా.. సీరియస్ గా రియాక్ట్ అయ్యారు స్వాతి.