ఆర్టీసీ విలీన సమస్యలు పరిష్కరించండి

ఆర్టీసీ విలీన సమస్యలు పరిష్కరించండి
  • ఆర్థిక శాఖకు ఎస్ డబ్ల్యూఎఫ్  జనరల్  సెక్రటరీ వినతి
  • మూడేండ్లయినా ఏపీలో తేల్చలేదని వెల్లడి

హైదరాబాద్, వెలుగు:  ప్రభుత్వంలో ఆర్టీసీలో విలీనం చేసే టైమ్ లో కార్మికుల సమస్యలను పరిష్కరించాలని స్టాఫ్​ అండ్  వర్కర్స్‌‌‌‌  ఫెడరేషన్  (ఎస్ డబ్ల్యూఎఫ్) జనరల్  సెక్రటరీ వీఎస్ రావు డిమాండ్  చేశారు. ఏపీలో ఆర్టీసీ విలీనమై మూడేళ్లవుతున్నా ఇప్పటికీ సమస్యలు పరిష్కారం కాలేదని ఆయన తెలిపారు. విలీనం సమయంలో ఎదురయ్యే  సమస్యలపై ఏపీలో పర్యటించి కార్మికులు, అధికారుల నుంచి వివరాలు తీసుకున్నామన్నారు. 

ఈ సందర్భంగా పలు అంశాలపై వినతిపత్రాన్ని సోమవారం ఫైనాన్స్  ప్రిన్సిపల్  సెక్రటరీకి, ట్రాన్స్ పోర్ట్ ఆర్ అండ్ బీ సెక్రటరీ, ఆర్టీసీ ఎండీకి లేఖ రాశామని ఓ ప్రకటనలో ఆయన చెప్పారు. ఏపీలో ఎదురైనా సమస్యలు ఇక్కడ రాకుండా చూడాలని కోరారు. ఆర్టీసీ విస్తరణ, డెవలప్ మెంట్, అప్పులు, హెల్త్  స్కీం, ఉద్యోగ భద్రత, రిటైర్ మెంట్ ఉద్యోగుల సమస్యలు, కారుణ్య నియమాకాలు వంటి సమస్యలను పరిష్కరించాలన్నారు.