డెడికేషన్ అంటే ఇది.. హ్యాట్సాఫ్ అంతే..

డెడికేషన్ అంటే ఇది.. హ్యాట్సాఫ్ అంతే..

ముంబైలో  ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లన్ని జలమయమయ్యాయి. ఎక్కడ చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. వాహనాల రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడుతోంది. ఇలాంటి కష్ట సమయంలో ఓ స్విగ్గీ డెలివరీ బాయ్  ఫుడ్ డెలివరీ  చేసేందుకు వెళ్లాడు. అది కూడా బైకో, సైకిల్ మీదో కాదు గుర్రంపైన. వినడానికి కాస్త విచిత్రంగా ఉంది కదూ.. అవును నిజమే మరి. రోడ్లపై నీరు చేరడంతో నగరంలో  పలు చోట్ల ట్రాఫిక్‌ స్తంభించింది. దీనితో అతను గుర్రంపై స్వారీ చేస్తూ  వర్షంలో తడుస్తూ ఫుడ్ డెలివరీ  చేశాడు.  ఇదంతా ఓ వ్యక్తి తన  కారులో నుంచి  వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా  వైరల్ గా మారింది. దీనితో నెటిజన్లు అతని డెడికేషన్ కు ఫిదా అయ్యామని..  మాటల్లేవ్ హ్యాట్సాప్ అంతే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ముంబైలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ ఇప్పటికే అంచనా వేసింది. అరెంజ్ అలర్ట్‌ కూడా జారీ చేసింది. భారీ వర్షాల కారణంగా నగరంలోని కల్బాదేవి, సియోన్ ప్రాంతాల్లోని రెండు భవనాలు కూలిపోయాయి. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ప్రభావిత ప్రజలను సురక్షితంగా వేరే ప్రాంతలకు తరలిస్తున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రైళ్ల  5 నుండి 15 నిమిషాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.