సికింద్రాబాద్ లో స్విమ్మింగ్ పోటీలు... బహుమతులు ఇవ్వకుండా నిర్వాహకుడు పరార్

సికింద్రాబాద్ లో స్విమ్మింగ్ పోటీలు... బహుమతులు ఇవ్వకుండా నిర్వాహకుడు పరార్

సికింద్రాబాద్ లో మున్సిపల్ (వీవీ గురుమూర్తి మెమోరియల్) స్విమ్మింగ్ పూల్ దగ్గర రసాభాస నెలకొంది. మే 23వ తేదీ గురువారం పాన్ ఇండియా మాస్టర్స్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో స్విమ్మింగ్ పోటీలు నిర్వహించారు. అయితే, ఈ పోటీల్లో గెలిచిన వారికి బహుమతులు ఇవ్వకుండా నిర్వాహకుడు పాన్ ఇండియా జీఎస్ నటరాజన్ పరారైనట్లు విజేతలు ఆరోపిస్తున్నారు. పోటీల్లో గెలిచిన తమకు మెడల్స్ ఇవ్వడం లేదని విజేతలు గొడవకు దిగారు. దీంతో బహుమతుల ప్రధానంలో గందరగోళం నెలకొంది.

అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఒక్కొక్కరి నుండి 15 వందల రూపాయలు తీసుకున్నారని పోటీదారులు తెలిపారు. త్రాగడానికి నీటిని కూడా కొనుక్కోవాల్సిన పరిస్తితి ఏర్పడిందన్నారు.  ఇప్పుడు.. గెలిచినవారికి మెడల్స్ కూడా ఇవ్వడం లేదని ఆందోళనకు దిగారు.  ఇలా చేయడం ఇది మూడవసారని వారు చెప్పారు. గతంలో వారణాసి, నాసిక్ లో నిర్వహించిన పోటీలకు సంబందించిన మెడల్స్ కూడా ఇంతవరకు ఇవ్వలేదని ఆరోపించారు.  దీనికి ప్రధాన సూత్రధారి పాన్ ఇండియా జీఎస్ నటరాజన్ అని... అతను పారి పోయాడని పోలీసులకు పోటీ దారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.