కామారెడ్డి జిల్లాలో మరో 2 ఏటీసీలు .. ఐటీఐలను అప్గ్రేడ్ చేస్తున్న ప్రభుత్వం

కామారెడ్డి జిల్లాలో మరో 2 ఏటీసీలు .. ఐటీఐలను అప్గ్రేడ్ చేస్తున్న ప్రభుత్వం
  • గత ఏడాది  బిచ్​కుందలో ఏటీసీ సెంటర్ షురూ
  • కొత్తగా ఎల్లారెడ్డి, తాడ్వాయి ఏటీసీల్లో అడ్మిషన్లు 
  • ఈ నెల 31 వరకు ఆన్​లైన్​లో అప్లయ్​కు అవకాశం

కామారెడ్డి, వెలుగు :టెక్నాలజీకి అనుగుణంగా ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఐటీఐలను ఏటీసీ ( అడ్వాన్స్​డ్​ టెక్నాలజీ సెంటర్​)లుగా అప్​గ్రేడ్​ చేస్తోంది.  గత ఏడాది  బిచ్​కుందలో ఏటీసీ సెంటర్ ప్రారంభం కాగా, ఈసారి ఎల్లారెడ్డి, తాడ్వాయి సెంటర్లు షురూ కానున్నాయి. ఇప్పటికే మొదటి విడత అడ్మిషన్లు పూర్తి కాగా,  రెండో విడత అడ్మిషన్లకు అవకాశం ఇచ్చారు. ఈ సెంటర్లలో టి-గేట్ ( తెలంగాణ గేట్​వే ఆఫ్ అడాప్టివ్​ ట్రైనింగ్ అండ్ ఎంప్లాయిమెంట్​) స్కీమ్ లో అధునాతక శిక్షణ అందిస్తాయి. 

ఆయా కోర్సుల్లో శిక్షణ పొందిన విద్యార్థులకు అప్రెంటిస్​షిప్ తో పాటు, ఉపాధి కల్పించేందుకు టి-గేట్ కమిటీలను ఏర్పాటు చేశారు. జిల్లాస్థాయిలోని ఇండస్ర్టీస్, ఏటీసీ ప్రిన్సిపాల్స్,  కార్మిక, ఉపాధి కల్పన తదితర  శాఖల అధికారులు మెంటర్లుగా ఉండనున్నారు.   

ఒక్కో ఏటీసీలో 6 కోర్సులు, 172 సీట్లు.. 

జిల్లాలో ఉన్న 3 ఏటీసీల్లో 6  కోర్సులను ప్రవేశ పెట్టారు. అన్ని కోర్సులకు కలిపి 172 సీట్లు ఉంటాయి. ఆయా సెంటర్లలో మాడ్రన్​ఎక్విప్​మెంట్స్​తో  క్లాస్ రూమ్స్  ఏర్పాటు చేస్తున్నారు. ఈ కోర్సులకు కేంద్ర ప్రభుత్వం గుర్తింపు ఉంది.  బిచ్​కుంద, తాడ్వాయిలలో బిల్డింగ్​ల​ నిర్మాణాలు పూర్తై ఎక్విప్​మెంట్స్ వచ్చాయి.  ఎల్లారెడ్డిలో బిల్డింగ్ నిర్మాణం కొనసాగుతోంది.  
   
ఆన్​లైన్​లో అప్లయ్.. 

 ఎస్సెస్సీ పాసైనవారు ఆన్​లైన్​లో ఏటీసీకి అప్లయ్ చేసుకోవచ్చు. ఇప్పటికే మొదటి విడత కంప్లీట్ కాగా, రెండో విడతకు ఈ నెల 31 వరకు అవకాశం ఉంది. https.//iti.telangana.gov.in  వెబ్​సైట్ ద్వారా అప్లయ్ చేసుకోవాలి. ఆగస్టు ఫస్ట్ వీక్​లో సీట్లు కేటాయిస్తారు. ఆయా చోట్ల ఇంకా సీట్లు మిగిలి ఉంటే  మూడో విడత కౌన్సిలింగ్ లేదా స్పాట్​ అడ్మిషన్లకు అవకాశం ఉంది. ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 

ఏటీసీల్లో  కోర్సుల వివరాలు.. 

మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ ఆటోమేషన్, ఇండస్ర్టియల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్,  ఆర్టిసన్ యూజింగ్​ అడ్వాన్స్ టూల్స్,  బేసిక్ డిజైనర్ అండ్ వర్చువల్ వైరిఫైరియర్ ( మెకానికల్​), అడ్వాన్స్ సీఎస్​సీ మిషనింగ్ టెక్నిషియన్, మెకానిక్​  ఎలక్ర్టిక్​ వెహికల్, 
ఎలక్ర్టీషియన్​. 

ఉపాధి అవకాశాలు ఉన్న కోర్సులు

ఏటీసీల్లోని 6 కోర్సులు ఉపాధి అవకాశాలు కల్పించేవి.  విద్యార్థుల నైపుణ్యాలు పెంచేలా క్లాస్​ రూమ్స్ ఉన్నాయి. ప్రభుత్వం  ఐటీఐలను ఏటీసీలుగా అప్​గ్రేడ్ చేస్తోంది.  బిచ్​కుందలో ఏటీసీ ప్రారంభం కాగా, తాడ్వాయి, ఎల్లారెడ్డిలో  కౌన్సిలింగ్​కు అవకాశం ఇచ్చారు. ఈ నెల 31 వరకు ఆన్​లైన్​లో అప్లయ్ చేసుకోవచ్చు. సీట్లు మిగిలితే మూడో విడత కౌన్సిలింగ్​ లేదా నేరుగా ప్రవేశాలకు అవకాశం ఉంది.   - ప్రమోద్​కుమార్, జిల్లా కన్వీనర్​