రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో యువకులు రెచ్చిపోయారు. నాలెడ్జి సిటి సెంటర్ దగ్గర రేసింగ్ లకు పాల్పడ్డారు. కార్లకు భారీ సౌండ్ తో సైలెన్సర్స్ ఏర్పాటు చేసి నానా హంగామా సృష్టించారు. వీకెండ్ వస్తే చాలు యూత్ పోలీసుల కళ్లు గప్పి రోడ్లపై కలకలం రేపుతున్నారు. హైదరాబాద్ అవుట్ కర్ట్స్ రోడ్లపై కారు. బైక్ రేసింగ్ కు పాల్పడుతున్నారు.
నిన్న ( మే 23) అర్ధరాత్రి హోండా సిటీ AP 10 AL 5684 రేసింగ్ నిర్వహిస్తున్న కారు పోలీసులపై కి దూసుకు వచ్చింది. అడ్డుకున్న కానిస్టేబుల్ రమేష్ కు చేతికి గాయాలయ్యాయి. టీ హబ్ ఏరియాలో లో రేసింగ్ లు చేయకూడదంటూ పోలీసులు హెచ్చరికలు చేసిన యువత పట్టించుకోండం లేదు. ర్యాష్ డ్రైవింగ్ కి పాల్పడ్డ రేహాన్ (19 ) ను రాయదుర్గం పోలీసులు... అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుండి హోండా సిటీ కారు , మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. మరి కొంతమంది రేసర్లు పరారీలో ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న రాయదుర్గం పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.
