నాది పరిష్కారం లేని సమస్య..రేపే(మార్చి25) నా నిర్ణయం ప్రకటిస్తా: మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

నాది పరిష్కారం లేని సమస్య..రేపే(మార్చి25) నా నిర్ణయం ప్రకటిస్తా: మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

తన సమస్యకు పరిష్కారం టీ పీసీసీ చీఫ్ దగ్గర  లేదన్నారు మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.  మార్చి 24న ఇవాళ ఉదయం పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ జీవన్ రెడ్డితో  భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన జీవన్ రెడ్డి...తనకు టీ పీసీసీ చీఫ్ మహేశ్ ఎలాంటి హామీ ఇవ్వలేదని చెప్పారు. తాను పీసీసీ ముందు ఎలాంటి డిమాండ్లు పెట్టలేదన్నారు. తన సమస్యకు  పరిష్కారం తన దగ్గర లేదు, వారి దగ్గర లేదన్నారు. మార్చి 25న ఉదయం  10 గంటలకు తన రాజకీయ భవిష్యత్తుపై క్లారిటీ ఇస్తానని అన్నారు. 

 కాంగ్రెస్ పార్టీలో ఉండి స్వపక్షంతో యుద్ధం  చేయలేనని అన్నారు జీవన్ రెడ్డి.  తన  నిర్ణయం దైవ నిర్ణయంగా  భావిస్తున్నానని చెప్పారు.   మున్సిపల్ ఫలితాల వరకే పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని గతంలోనే చెప్పానన్నారు జీవన్ రెడ్డి. తనతో పాటు రేపు ఎంత మంది రాజీనామా చేస్తారో తెల్వదన్నారు.

గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న జీవన్ రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేస్తానని చెప్పారు.మార్చి 25న రాజీనామా చేస్తానని ప్రకటించారు. దీంతో పలువురు కాంగ్రెస్ నేతలు జీవన్ రెడ్డి పార్టీని వీడకుండా ఉండేందుకు బుజ్జగిస్తున్నారు.