
తెలంగాణ స్కిల్, అకడమిక్ అండ్ ట్రైనింగ్ శాటిలైట్ టీవీ (టీ శాట్) సీఈవోగా నియమించినందుకు.. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ణతలు తెలియజేశారు బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి. 2024, మార్చి 6వ తేదీ హైదరాబాద్ లోని సీఎం నివాసంలో కలిశారాయన. కొత్త బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని.. విద్యార్థులకు కావాల్సిన సమాచారాన్ని మరింత నాణ్యతతో అందించటానికి కృషి చేయనున్నట్లు స్పష్టం చేశారు.
టీశాట్ కొత్త సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డిని ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు సీఎం రేవంత్ రెడ్డి. కొత్త బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించటానికి ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తానని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి.