జియో టీవీలో టీ-శాట్ ‌క్లాస్‌‌లు

జియో టీవీలో టీ-శాట్ ‌క్లాస్‌‌లు

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఎడ్యుకేషన్ ‌‌ఛానెల్ ‌‌టీ–శాట్‌ను ఇక నుంచి జియో టీవీ యాప్‌‌లో ఫ్రీగా చూడొచ్చు. దీనిపై టీ–శాట్‌ నెట్‌వర్క్‌‌, జియో నెట్‌వర్క్ ‌ల మధ్య బుధవారం పార్ట‌న‌ర్‌‌‌‌షిప్ ‌‌కుదిరింది. తెలంగాణలో ఉన్న 1.59 కోట్లు, దేశంలోని 40 కోట్ల జియో నెట్‌వర్క్ ‌యూజర్లు జియో టీవీ ద్వారా టీ–శాట్‌ ఛానెల్‌‌ను చూడడానికి అవకాశం ఉంటుంది. ఏడు రోజుల క్రితం లైవ్ ‌‌అయిన క్లాస్‌లను కూడా ఎన్ని సార్ల‌యినా చూడడానికి వీలుంటుందని జియో పేర్కొంది. తమ లైవ్‌‌క్లాస్‌లను మిస్‌ అయితే ‘క్యాచ్‌‌–అప్ ‌టీవీ’ ఫెసిలిటీ ద్వారా ఈ క్లాస్‌లను చూడడానికి అవకాశం ఉంటుందని తెలిపింది. జియో టీవీలో మొత్తంగా రూ. 700 + ఛానెల్స్ ‌ఉన్నాయి. ఇందులో కేవలం ఎడ్యుకేషన్‌ ఛానెల్స్‌
64 ఉన్నాయి.

‘స్వయం ప్రభా’ కింద హ్యూమన్ ‌‌రిసోర్సెస్‌ డెవలప్‌‌మెంట్‌ వీటిని నిర్వహిస్తోంది. కరోనా దెబ్బతో తెలంగాణలో ఆన్‌‌లైన్‌ స్కూలింగ్ ‌టీ–శాట్ ఛానెల్ ‌‌ద్వారా జరుగుతోంది. సొసైటీ ఫర్ ‌‌‌‌తెలంగాణ స్టేట్‌ నెట్‌వర్క్‌‌(సాఫ్ట్‌‌నెట్‌) టీ–శాట్ ద్వారా ఆన్‌‌లైన్ ‌‌కంటెంట్‌ను అందిస్తోంది. టీ–శాట్ నిపుణా కింద అగ్రికల్చర్‌‌‌‌, రూరల్ ‌‌డెవలప్‌‌మెంట్‌,టెలీమెడిసిన్‌‌, ఈ–గవర్నెన్స్ ‌ వంటి అంశాలపై ఆన్‌‌లైన్ ‌కంటెంట్‌ను అందిస్తోంది. టీ–శాట్ విద్యా ద్వారా ఈ–లెర్నింగ్‌, డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్ ‌‌వంటి వాటికి కంటెంట్‌ను ప్రొవైడ్ చేస్తోంది. వీటితో పాటు ఐఐటీ–జేఈఈ, నీట్‌ వంటి ఎగ్జామ్స్‌కు కోచింగ్‌ ఇస్తోంది. వీటి కోసం ఆన్‌‌లైన్ ‌‌కంటెంట్‌లను ప్రొఫెసర్ ‌‌‌‌చుక్కా రామయ్య వంటి సబ్జెక్ట్ ‌‌ఎక్స్‌పర్ట్స్‌‌ అందిస్తున్నారు. ఈ పార్ట్ న‌ర్‌‌షిప్ ‌‌ద్వారా తెలంగాణలోని విద్యార్ధులకు మేలు కలుగుతుందని టీ–శాట్ సీఈఓ ఆర్‌‌‌‌. శైలేష్‌‌రెడ్డి , జీయో నెట్‌వర్క్ సీఈఓ కేసీ రెడ్డి అన్నారు.