టీ20 వరల్డ్ కప్ : ఉత్కంఠ పోరులో నెదర్లాండ్స్ గెలుపు

టీ20 వరల్డ్ కప్ : ఉత్కంఠ పోరులో నెదర్లాండ్స్ గెలుపు

టీ20 వరల్డ్ కప్ క్వాలిఫైయింగ్ రెండో మ్యాచ్ లో నెదర్లాండ్స్ విజయం సాధించింది.  చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో యూఏఈపై మూడు వికెట్ల తేడాతో గెలిపొందింది. యూఏఈ నిర్ధేశించిన 111 లక్ష్యాన్ని చేధించేందుకు నెదర్లాండ్స్ చెమటోడ్చింది. ఒక దశలో యూఏఈ గెలుస్తుందని అనిపించినా..నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్.. టిమ్ ప్రింగిల్తో కలిసి 27 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొలిపి తమ దేశానికి గెలుపును అందించాడు.

యూఏఈ బౌలర్లో తరపున జునైద్ సిద్ధిఖీ 3 వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన యూఏఈ 111 రన్స్కు అలౌట్ అయ్యింది. యూఏఈ బాట్స్మెన్స్ లలో మహ్మద్ వసీమ్ 41 రన్స్ చేశాడు. నెదర్లాండ్స్  బౌలర్లలో బాస్ డిలీ 3వికెట్లు తీశాడు.