టీ20 వరల్డ్ కప్‌: భారత్-పాక్ మ్యాచ్‌ డేట్ ఫిక్స్

V6 Velugu Posted on Aug 04, 2021

  • అక్టోబర్ 24న దుబాయ్ వేదికగా మ్యాచ్‌

టీ20 వరల్డ్ కప్ మ్యాచుల కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. ఒకే గ్రూప్ నుంచి భారత్ –పాక్ జట్లు బరిలోకి దిగుతుండడంతో ఈ జట్ల మధ్య  మ్యాచ్ రసవత్తరంగా సాగుతుందని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో దాయాదుల సమరానికి ముహూర్తం ఖరారైంది. అక్టోబర్ 24న దుబాయ్ వేదికగా మ్యాచ్ జరగనుంది. వచ్చే అక్టోబర్‌ 17 నుంచి నవంబర్‌ 14 వరకు టీ-20 ప్రపంచకప్‌ జరుగుతుందన్న సంగతి తెలిసిందే.
 చిరకాల ప్రత్యర్థులైన భారత పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్‌ అంటే ఆ మాజాయే వేరు. క్రికెట్‌ ప్రేమికులు ఆ మజాను టోర్నీ ఆరంభమైన కొద్ది రోజుల్లోనే ఆస్వాదించే అవకాశం కలుగుతోంది. టీ20 ప్రపంచ కప్‌ కోసం ఐసీసీ విడుదల చేసిన జాబితాలో పాకిస్తాన్‌, భారత జట్లు  గ్రూప్‌-2 నుంచి బరిలోకి దిగుతున్నాయి.  చిరకాల ప్రత్యర్థులైన ఈ రెండు జట్లు ఈ ఏడాది దుబాయ్‌ వేదికగా అక్టోబర్ 24న జరగనున్న మ్యాచ్‌లో తలపడనున్నాయి. 
 

Tagged T20 World Cup, , cricket latest updates, India-pakistan match, t20 world cup schedule, indo-pak match

Latest Videos

Subscribe Now

More News