- రాష్ట్ర ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్
- తాడిచెర్ల జెన్ కో ఓపెన్ కాస్ట్ ను పరిశీలించి ఆఫీసర్లతో రివ్యూ మీటింగ్
మల్హర్, వెలుగు: తాడిచెర్ల కోల్ బ్లాక్ ఓపెన్ కాస్ట్ మైన్ భూ సేకరణ ప్రక్రియ త్వరగా కంప్లీట్ చేయాలని రాష్ట్ర ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ ఆదేశించారు. భూసేకరణ, పునరావాస చర్యలు న్యాయంగా, పారదర్శకంగా, వేగంగా పూర్తి చేయాలని స్పష్టంచేశారు. మంగళవారం జెన్ కో సీఎండీ హరీశ్, ఏఎంఆర్ సీఎండీ మహేశ్‌రెడ్డితో కలిసి ఆయన తాడిచెర్ల- కోల్ బ్లాక్ ఓపెన్ కాస్ట్ మైన్‌ను పరిశీలించారు.
ఈ సందర్భంగా అధికారులు మైనింగ్ కార్యకలాపాలు, ఉత్పత్తి ప్రక్రియ, భద్రతా ప్రమాణాలు, పర్యావరణ చర్యలు వంటి అంశాలను పరిశీలించారు. మైనింగ్ ప్రాంతం నుంచి తాడిచెర్ల గ్రామాన్ని, వాహన ప్రాంగణం, మెషీన్లు, ఫీడర్ బ్రేకర్ పరిశీలించారు. భూ సేకరణ పరిహారం పంపిణీ, పునరావాస చర్యలపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకు న్నారు. అనంతరం తాడిచెర్ల ఏఎంఆర్ ఆఫీసులో రివ్యూ మీటింగ్ నిర్వహించారు.
అనంతరం తాడిచెర్ల నుంచి కేటీపీపీ వరకు కన్వేయర్ బెల్ట్ నిర్మాణం, రవాణామార్గం, దూరబారాలపై ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షించారు. కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ శర్మ , ఏఎంఆర్ డైరెక్టర్ సాయి నితీశ్‌రెడ్డి, ఏఎంఆర్ వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి, విద్యుత్తు శాఖ ఈడీ లక్ష్మయ్య, కేటీపీసీ సీఈ శ్రీ ప్రకాష్, ఎస్ఈ ముత్యాల రావు, అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, జనరల్ మేనేజర్ కేఎస్ఎన్ మూర్తి, తహసీల్దార్ రవి కుమార్, జెన్ కో, ఏఎంఆర్ ఆఫీసర్లు పాల్గొన్నారు.
