తాడ్వాయి, వెలుగు : మండలంలోని పలు అభివృద్ధి పనుల కోసం నిధులు మంజూరు చేయాలని కాంగ్రెస్ మండల లీడర్లు ఎమ్మెల్యే మదన్మోహన్ను బుధవారం హైదరాబాద్ లో కలిశారు. టేక్రియా హైవే నుంచి చందాపూర్ వరకు ఉన్న బీటీ రోడ్డును డబుల్ రోడ్డు, బ్రాహ్మణపల్లి పాఠశాల ప్రహరీ, పలు అభివృద్ధి పనులపై ఎమ్మెల్యేతో చర్చించగా సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.
రోడ్డు విస్తీర్ణం కోసం మంత్రిని కలుస్తానని హామీ ఇచ్చినట్లు చెప్పారు. ఎమ్మెల్యేను కలిసినవారిలో కాంగ్రెస్మండల ప్రధాన కార్యదర్శి ఏడీ నరసింహారెడ్డి, బ్రాహ్మణపల్లి ఇన్చార్జి రాజేశ్వర్ రెడ్డి, గ్రామ అధ్యక్షుడు తూర్పు రాజేశ్వరరావు, భోగ నరేందర్, జంగం లింగం తదితరులు ఉన్నారు.
